Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
the director become to set a way

ఈ సంచికలో >> సినిమా >>

ఇది ‘ఎవడు’ కథేనా?

this story of 'yevadu'

చాలా రోజుల క్రితం ‘బన్నీ చెర్రీ’ అనే ఓ సినిమా టైటిల్‌ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ రిజిస్టర్‌ చేయించారని వార్తలు వచ్చాయి. చరణ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించాలనుకుంటున్నారని గుసగుసలు విన్పించాయి కూడా. అల్లు అర్జున్‌, చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కిందిగానీ, దాని పేరు ‘బన్నీ చెర్రీ’ కాదు, ‘ఎవడు’.

వివిధ కారణాల వల్ల ‘ఎవడు’ విడుదల కాలేదు. ఈలోగా ‘బన్నీ చెర్రీ’ పేరుతో సినిమా వచ్చేస్తోంది. రేపు విడుదల కానుంది ఈ సినిమా. దాంతో, ‘ఎవడు’, ‘బన్నీ చెర్రీ’ ఒకటే కథ అనే ప్రచారం తెరపైకొచ్చింది. ‘బన్నీ చెర్రీ’ యూనిట్‌ మాత్రం తమది ‘ఎవడు’ కథ కాదని చెబుతూనే వుంది.

సినిమా రేపే విడుదలవుతుంది కాబట్టి, ‘ఎవడు’తో ‘బన్నీ చెర్రీ’కి పోలికేంటో కొంతవరకు తెలియొచ్చు. పూర్తిగా తెలియాలంటే ‘ఎవడు’ కూడా విడుదల కావాల్సి వుంటుంది. సంక్రాంతికి ‘ఎవడు’ రావొచ్చు. ఈలోగా ‘బన్నీ చెర్రీ’ సినిమాకి ‘ఎవడు’ వార్తలతో క్రేజ్‌ పెరిగిందని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
mind blowing varma question