Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
baboy! baahubali

ఈ సంచికలో >> సినిమా >>

ఆ రెండు సినిమాలకు అవార్డులా

this two movies

కమర్షియల్‌ సినిమాలు, అవార్డు సినిమాలని సినిమాల్ని విభజించి చూస్తుండడం కొత్త విషయం కాదు. అవార్డు సినిమాలంటే చిన్న సినిమాలేనన్న ముద్ర పడిపోయింది. అలా చిన్న సినిమాలుగా వస్తోన్న రెండు సినిమాలు అవార్డులు పొందే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో అనుకుంటున్నారు. అవేమంటే... ‘కమలతో నా ప్రయాణం’, ‘మధుమతి’.

ఈ రెండు సినిమాలూ పదహారణాల తెలుగమ్మాయిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నవే. ‘మధుమతి’లో బుల్లితెర యాంకర్‌ ఉదయభాను హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘కమలతో నా ప్రయాణం’ సినిమాలో వేద హీరోయిన్‌గా నటించింది. ‘మధుమతి’ సినిమా గతంలో వచ్చిన ‘పవిత్ర’ షేడ్స్‌లో కన్పిస్తోంటే, ‘కమలతో నా ప్రయాణం’ పూర్తిగా క్లాస్‌ టచ్‌తో వుందనిపిస్తోంది.

వీటిల్లో ఏ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందుతుందోగాని, రెండిటిపైనా అంచనాలు పెరుగుతున్నాయి. చలం రాసిన ‘ఊరి చివర ఇల్లు’ అనే కథ ఆధారంగా ‘కమలతో నా ప్రయాణం’ సినిమా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అవార్డులు పొందే అర్హత వీటికి వుందని సినిమాలు ఇంకా విడుదల కాక ముందే అనుకోవడం సినిమాలపై సినీ పరిశ్రమలో వున్న అంచనాలకు నిదర్శనం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam