Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
telisina sangatule

ఈ సంచికలో >> సినిమా >>

దూసుకెళ్తున్న నవతరం హీరో

young hero

నటుడిగా నిరూపించుకున్నా, సక్సెస్సె కొలమానం సినీ రంగంలో. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సందీప్‌ కిషన్‌కి, కమర్షియల్‌ సక్సెస్‌ ఎట్టకేలకు దొరికింది. అతను నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాకి విడుదలైన రోజు నుంచే మంచి స్పందన లభించింది. కమర్షియల్‌ హీరోగా నిలదొక్కుకున్నట్లేనని తొలిరోజే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ రిజల్ట్‌ చూసి, సినిమా పరిశ్రమకు చెందినవారు అభిప్రాయపడ్డారు.

తొలి కమర్షియల్‌ సక్సెస్‌ లభించిన ఆనందంలో వున్న సందీప్‌ కిషన్‌కి, వరుస ఆఫర్లు వస్తున్నాయంట. సక్సెస్‌ ఎప్పుడూ ఆనందాన్నిస్తుందని అంటున్న సందీప్‌ కిషన్‌, ఇప్పుడే ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందనీ, మంచి కథల్ని ఎంపిక చేసుకుంటానని చెప్పాడు.

యంగ్‌ హీరోల రేసులో సందీప్‌ కిషన్‌ రానున్న రోజుల్లో ఏ ప్లేస్‌ దక్కించుకుంటాడోగాని, మంచి నటుడిగా ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్న అతనికి మంచి ఫ్యూచర్ వుందని సినిమా పరిశ్రమలో అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళూ కాలం కలిసి రాలేదు. ఇప్పుడు దశ తిరిగినట్లే కనిపిస్తోంది. ఇక దూసుకెళ్ళడమే తరువాయి. బెస్టాఫ్‌ లక్‌ సందీప్‌ కిషన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
mohanbabu with sarkar