Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
where are telugu heroines in telugu cinemas?

ఈ సంచికలో >> సినిమా >>

నగ్నత్వానికి కీర్తి కిరీటం

heights of nudity

షెర్లీన్‌ చోప్రా నటించిన ‘కామసూత్ర`3డి’ సినిమా ఆస్కార్‌ బరిలో నిలిచిందన్న వార్త చాలా మందిని ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఈ సినిమాలోని ఓ పాట ‘ఒరిజినల్‌ సాంగ్‌’ కేటగిరీలో ఆస్కార్‌ రేసుకి ఎంపికైంది. అసలు విషయం ఆరా తీస్తే, ‘కామసూత్ర’ అన్న అంశమే ఈ సినిమాని ఆస్కార్‌ బరిలో నిలిపిందని తేలింది.

ప్రపంచ దేశాల్లో ఇండియన్‌ కామసూత్రకి ఉండే గుర్తింపు ప్రత్యేకం. అందుకనే ‘కామసూత్ర`3డి’ సినిమా నిర్మాణం సమయంలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అలా ఈ సినిమాలోని పాటకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంటర్నెట్‌ ద్వారా సినిమాకి కల్పించిన ప్రచారమూ, ఆస్కార్‌ రేసులో ఈ సినిమా నిలవడానికి కారణమైందంటున్నారు.

భారతీయ సినీ పరిశ్రమ నుంచీ ఏటా వందల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. కొన్ని అవార్డుల కోసమే అన్నట్లుగా వస్తున్నా, వాటిని ఆస్కార్‌ వంటి పురస్కారాల కమిటీలు గుర్తించడంలేదు. ఎప్పుడో ఐదేళ్ళకో పదేళ్ళకో ఓ భారతీయ సినిమా ఆస్కార్‌ గుర్తింపు పొందుతోంది. ‘కామసూత్ర`3డి’కి ఆస్కార్‌ గుర్తింపు దక్కితే ఆనందించాలో, బాధపడాలో అర్థం కావడంలేదు ఇక్కడివారికి.

మరిన్ని సినిమా కబుర్లు
Sting Operations