Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope janaury 24- janaury 30

ఈ సంచికలో >> శీర్షికలు >>

చేతి రుమాళ్ళచరిత్ర - ఆదూరి హైమవతి

Handkerchief history

సాధన మధ్యాహ్నం పన్నెండు గంటలవేళ ‘ఇంటర్ వ్యూ’ కు వెళ్ళింది.ఎండనపడి బస్ లో ప్రయాణించి వెళ్ళడంతో వళ్ళంతా చెమట పట్టింది. అడ్రెస్ కనుక్కుని వెళ్ళి హాల్లో కూర్చుంది. కరెంట్ కట్ వల్ల అక్కడఫ్యాన్ లేదు.ముఖం నిండా చెపట పట్టి కారుతున్నది. తుడుచుకుందా మంటే ఏమీలేదు.

అక్కడికి వచ్చిన జవాన్ " అమ్మా! మీ రేనా సాధన అంటే! అయ్యగారు పిలు స్తున్నారు.ముందు ఆచెమట తుడుచుకుని వెళ్ళండి"అన్నాడు. ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో వెతుక్కుం టుండటం చూసి " అమ్మా! మీరేమీ అనుకోకపోతే అక్కడ వాష్ బేసిన్ వద్ద ముఖం కడుక్కుని అక్కడే ఉన్న తువ్వాలుతో తుడుచుకు వెళ్ళండి. అయ్యగార్ని అలా కలవకండి ." అని చెప్పాడు. చేతిరుమాలు తెచ్చుకోకుండా తాను చేసినపొరపాటుకు సాధన ఎంతగానో బాధపడింది.

ముకుందు ముక్కు కారుతున్నా అలాగే స్కూల్ కెళ్ళి మాస్టారు అడిగినప్రశ్నకు కారుతున్న ముక్కు ,పైకి ఎగ చీదుకుంటూ జవాబు చెప్పడంతో "ఏం ముకుందూ !అలా ఎగచీదుకోపోతే చేతి రుమాలు తెచ్చుకోవచ్చుగా ముక్కు తుడుచుకోను ." అనికోప్పడ్డారు మాస్టారు.

మనీషా ఆరోజు పార్టీలో అంతా లంచ్ చేస్తుండగా, పుటిక్కిన తుమ్మింది.అంతా ఆమెవేపు అస[హ్యం] హనం, గా చూశారు.చిన్నబుచ్చుకున్న మనీషాతో పక్కనే ఉన్న స్నేహితురాలు మంజుల " ఏమోయ్! చేతి రుమాలు ముక్కుకు అడ్డంపెట్టుకోవచ్చుగా " అంది.

ఆనందు పుట్టినరోజునాడు దైవదర్శనానికి క్యూలో నిల్చున్నాడు. అపుకోలేని దగ్గువచ్చి దగ్గడం తో ముందున్నవారంతా వెనక్కు తిరిగి “కనీసం కర్చీఫ్ అడ్డుపెట్టుకో వచ్చు కదా!" అని విసుక్కున్నారు. పుట్టిన రోజునాడు అలా అంతా కసురుకోడం తో చిన్నబుచ్చుకున్నాడు ఆనందు.

ఎక్కడికి వెళ్ళినా చేతిరుమాలు ఉంచుకోడం ఎంతో అవసరం , నలుగురిలో తుమ్ము వచ్చినా దగ్గువచ్చినా , ముక్కు కారినా రుమాలు అడ్డుంచుకోడం కనీస సభ్యత.

చేతిరుమాలు అన్నది కేవలం ముఖం తుడుచుకునేందుకే కాక , ఇంకా ఎన్నింటికో ఉపయోగి స్తుంది.ఏదైనా అత్యవసరమైన వస్తువులను దాన్లో కట్టుకోవచ్చు.చిన్నపాటి దె బ్బ మనకుకానీ, ఎవరి కైనా తగిలినా దా న్ని తడిపి ప్రధమచికిత్స చేయవచ్చు.[ చేసుకోవచ్చు]. ఎక్కడైనాకూర్చో వలసి వచ్చినప్పుడు మనం కేటాయించు కున్న స్థానంలో దాన్నిఉంచవచ్చు.రైళ్ళాలోనూ,బస్సు ల్లోనూ ఎక్కివచ్చేలోగా ఖాళీ ఐన సీట్లలో జేబు రుమాలు కిటికీల్లోంచీ విసిరేయటం చూస్తుంటాం కదా! మనం కూర్చునే కుర్చీలోనో బల్లమీదో ఏదైనా దుమ్ము,లేక తడి ఉంటే రుమాలుతోతుడుచు కుని కుర్చుంటే మనవెనక బట్టలకు మరకలు కావు.

అసలీ జేబురుమాలు కధాకమామీషూ కొంచెం చెప్పుకుందామా!

ప్రపంచ వ్యాప్తంగా జేబురుమాళ్ళు ఐదొందల సం క్రితం నుంచీ వాడుతున్నట్లు తెలుస్తున్నది. 15వ శతాబ్దంలో    ' గియోవన్నీ సోర్జా ' అనే ఇటాలియన్ రాజు వద్ద 400 చేతిరుమాళ్ళు ఉండేవిట! బ్రిటన్లో చేతిరుమాళ్ళుగాకాయితాల ను ఉపయోగించేవారుట! నేడూ అమేరికావంటిదేశాల్లో పేపర్ టవల్సే వాడి డస్ట్ బిన్లో వేసేసి వెళుతుంటారు.

18వశతాభ్ది ప్రాంతంలో ముక్కుపొడి వేసుకునే వారంతా చేతిరుమాళ్ళను వాడటం మొద లెట్టారు .బ్రిటన్ లో ఒకప్పుడు చేతిరుమాళ్ళు చదరంగానే ఉండాలని ' డిక్రీ ' విడుదలైందిట! 18, 19 శతాభ్దులలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో రాజకుటుంబీకులు బంగారు, వెండి ,పట్టుదారాలతోఎంతో అందంగా డిజైన్ చేసినవి, ఎంబ్రాయిడరీచేసినవీ ఐన రుమాళ్ళను హుందాగావాడేవారుట! వారు ఉపయోగించే రుమాళ్ళు వారి రాచరికానికి నిదర్శనంగాఉండేవిట!

వాతావరణం నుండీ తమనుతాము రక్షించుకోను, టోపీలతోపాటుగా చేతిరుమాళ్ళూ వాడుకోడం మొదలైంది.నేడు కేవల చేతిరుమాళ్ళకే పదినుంచీ పాతికరూపాయలవరకూ మనం వెచ్చిస్తూనే ఉన్నాం. ఎన్నో అందమైన డిజైన్లలోఆడవారికీ,మగవారికీ, పిల్లలకూ వేర్వేరు సైజుల్లో ఆకారాల్లో చేతిరుమాళ్ళు మనకు షాపుల్లో లభ్యమవు తున్నాయి కదా!  ఎన్నో సమయాల్లో చేతి రుమాళ్ళు మనకు స్నేహితునిలా సహకరిస్తుంటాయి. మన ఇళ్ళలో బిగుతైన రంగుల, పూల బట్టలను నలువైపులా [మన ఇళ్ళలో కుట్టుమిషన్ ఉంటే సరి లేకపోతే ]చేతితో కుట్టి కాలక్షేపంగా చిన్న ఎంబ్రాయిడరీ పూలో రంగు దారాలతో చిన్న డిజైల్సో  వేసుకునిఖర్చులేకుండా రుమాళ్ళు తయారు చేసుకోవచ్చు. రుమాలు ఎవరిదైనా మనం తీసేసుకుంటే దాంతో మనస్నేహం వారితో కట్టై పోతుందని చాలామందికి ఓ నమ్మకం -అందుకే ఎవ్వరి రుమాలూ అచ్చంగా [దొరికితే] తీసేసుకోకండి. మంచి స్నేహం మరువంపుమొలక వంటిదికదా! దాన్ని ఎట్టిపరిస్థితిలోనూ దూరం చేసుకోరాదు.

ఏదైనాకానీ చేతి రుమాలు తోనే బయటికెళ్ళే అలవాటుచేసుకోడం ఎంతైనామంచిది.అదీనీ మన ఆంధ్రప్రదేశ్ లో ఎండలకు తప్పనిసరికదా!

మరిన్ని శీర్షికలు
TTu trayam Sada Smarami