Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
300 movies on release pending

ఈ సంచికలో >> సినిమా >>

ఇదెప్పుడొస్తుందో

Ideppudostundo

మెగాస్టార్‌, పవర్‌స్టార్‌లను తలదన్నే రేంజ్‌లో తన సినిమాకి ప్రమోషన్‌ చేసుకున్నాడో కొత్త నటుడు. ఇంటర్నెట్‌లో అయితే అతని సినిమా టీజర్‌కి పెద్ద సంఖ్యలో లైకులు వచ్చి పడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే టీజర్‌తో సెన్సేషన్‌ సృష్టించాడు. పేరు సంపూ అలియాస్‌ సంపూర్ణేష్‌బాబు. సినిమా పేరు ‘హృదయకాలేయం’.

టైటిల్‌ వినగానే ఇదేం సినిమా? అనుకున్నా, టీజర్‌ వచ్చాక సినిమా గురించి తక్కువగా అంచనా వేయడం మానేశారు అందరూ. కానీ సినిమా ఇంతవరకూ విడుదల కాలేదు. సంపూర్ణేష్‌బాబు మాత్రం పాపులారిటీ పెంచుకున్నాడు. ఈ సినిమా ఎట్టకేలకు విడుదలవుతోంది. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తారట.

ఇదివరకు కూడా విడుదలపై కొన్ని ప్రకటనలు సినిమా యూనిట్‌ నుంచి వచ్చాయి, ఫిబ్రవరిలో అయినా సంపూర్ణేష్‌బాబు సినిమా ‘హృదయకాలేయం’ థియేటర్లను తాకుతుందో లేదో.

 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam