Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pattabhi Rami Reddy Tikkavarapu Biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఫిబ్రవరి 14 - ఫిబ్రవరి 20) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తం మీద మంచి ఫలితాలే పొందుతారు అధికారులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకొనుట వలన పనులలో లబ్దిని పొందుతారు. బంధుమిత్రులతో సమయాన్ని నచ్చిన విధంగా గడుపుటకు ఆస్కారం ఉంది. శుభకార్యములలో పాల్గొంటారు వాటిమూలాన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను దాదాపు పూర్తిచేసే అవకాశం ఉంది. కాకపోతే మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి మంచిది. విద్యార్థులకు పెద్దల ద్వారా మంచి మంచి సలహాలను పొందుతారు వాటిని ఆచరించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు మంచిపేరు లభిస్తుంది చేపట్టిన పనుల వలన గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాకపోతే అనుభవజ్ఞుల సూచనలు తీసుకోండి. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టుటకు మంచికాలం శ్రమించుట చేత మంచి ఫలితాలు కలుగుతాయి. కళారంగంలో ఉన్నవారికి ప్రయాణాలు తప్పక పోవచ్చును, దూరప్రదేశాల నుండి వార్తను వింటారు.

వృషభ రాశి

ఈవారం మొత్తం మీద నలుగురికి ఉపయోగపడే ఆలోచనలను మాత్రం చేస్తారు వాటిమూలన పేరును సంపాదించుకొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను కొంత ఆలస్యం అయినను పూర్తిచేస్తారు. సౌఖ్యం ఆశిస్తారు భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిఉంటారు. చేపట్టిన పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయండి మంచిది. ఒకవార్త మీలో నిరుత్సాహం ను కలుగజేస్తుంది మానసికంగా దృడంగా ఉండుట మంచిది. విద్యార్థులకు ప్రయత్నంకు తగిన ఫలితం వచ్చుఅవకాశం ఉంది కావున ప్రణాళికతో ముందుకు వెళ్ళుట ద్వారా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులకు అనుగుణంగా నడుచుకోండి మంచిది. వ్యాపారులకు పెద్దలతో ఉన్న పరిచయాలు తప్పక అనుకూలిస్తాయి వాటి వలన నూతన అవాకాశాలు వస్తాయి. కళారంగంలో ఉన్నవారికి సమయపాలన అవసరం శ్రమించే గుణం లాభంను కలగజేస్తుంది.


మిథున రాశి
ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుతారు తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. భోజనం విషయంలో సమయపాలన మంచిది. కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలకు ప్రాధన్యం ఇవ్వండి తద్వారా చిన్న చిన్న విభేదాలు కలిగినను సమసిపోయే అవకాశం ఉంది. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. పనులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు అవగాహన ఉన్నచో మంచిఫలితాలు పొందుతారు. సర్దుకుపోయే స్వభావం అనుకూలిస్తుంది. ఉద్యోగులకు అధికారుల వలన పనిభారం తప్పకపోవచ్చును. చేపట్టిన పనులలో ఆలస్యంగా ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ప్రయాణాల వలన బడలిక ఉంటుంది అలాగే శ్రమను పొందుతారు నిదానం అవసరం. కళారంగంలో ఉన్నవారికి మీ అనుకున్న వారితో మనస్పర్థలు కలిగే ఆస్కారం ఉంది వాటికి తావివ్వకండి.

కర్కాటక రాశి

ఈవారం మొత్తం మీద అనారోగ్యసమస్యలు భాదించే అవకాశం కలదు కావున తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. మీయొక్క మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది కావున ఆచితూచి వ్యవహరించుట మంచిది. ప్రయాణాల వలన బడలిక చెందుతారు పెద్దగా మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ఆశించిన దానికన్నా ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఇబ్బందులు తప్పక పోవచ్చును ఓపికను కలిగి ఉండే ప్రయత్నం చేయండి. సమయపాలన అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పకపొవచ్చును నూతన పనులను చేపట్టకండి. ముందుగా గతంలోచేపట్టిన పనులను పూర్తిచేయండి. వ్యాపారులకు ఊహించని ఖర్చులు అయ్యే అవకాశం ఉంది కావున నిదానం అవసరం. కళారంగంలో ఉన్నవారికి సూచన పనికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది.


సింహ రాశి

ఈవారం మొత్తం మీద బాగుంటుంది తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యములలో పాల్గొంటారు సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడిపే అవకాశం ఉంది. కాకపోతే కొన్నివిషయాల్లో అధికంగా ఆలోచనలు చేయుట చేత స్వల్పఇబ్బందులు తప్పక పోవచ్చును. విద్యార్థులకు తమ ఆలోచనలు పెద్దలకు తెలుపుట మంచిది వాటిని పూర్తిచేసుకొనే ప్రయత్నంలో శ్రద్ధతో పనిచేయుట మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చును. అందరితో కలిసి నూతన పనులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారులకు క్రిందిస్థాయి ఉద్యోగుల వలన లబ్దిని పొందుతారు, ఆర్ధికంగా బాగుంటుంది. కళారంగంలో ఉన్నవారికి తాముచేసిన వాటికి నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది.

 

కన్యా రాశి

ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి కొంత ఇబ్బందులు పొందినను వాటిని పూర్తిచేస్తారు. కాకపోతే తలపెట్టిన పనుల వలన అధికమైన ఆలోచనలు కలిగిఉంటారు. కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు ఒకవిషయంలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్దకూడదు తగిన జాగ్రత్తలు చేపట్టండి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు అదేవిధంగా మంచి ప్రణాళిక అవసరం. విద్యార్థులకు చర్చా సంబంధమైన విషయాల్లో పాల్గొంటారు. నూతన పనులను చేపడుతారు. ఉద్యోగులకు అధికారులతో మంచి సంబంధాలు ఉండేలా ప్రయత్నం పెంచుట మేలుచేస్తుంది. వ్యాపారులకు మిశ్రమఫలితాలు పొందుతారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం అనేది సూచన. కళారంగంలో ఉన్నవారికి పనిఒత్తిడి ఉంటుంది అలాగే సమయాన్ని ప్రయాణాలలో గడుపుతారు.కుటుంబసభ్యులకు సమయం ఇవ్వడం అనేది సూచన.

 

తులా రాశి

ఈవారం మొత్తం మీద తలపెట్టిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంది కావున విలువైన పనులను చేపట్టుట మంచిది. వారం చివరలో మాత్రం కొంత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. పనులలో శ్రమను మాత్రం పొందుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన చర్యలు చేపట్టుట మంచిది. నచ్చని వారికి దూరంగా ఉండుట మేలు వివాదాలకు తావివ్వకండి. ప్రయాణాలు చేయుట ద్వారా మీరుఆశించిన పనులు కొంతమేర మాత్రమే అయ్యే అవకాశం కలదు. విద్యార్థులకు కష్టం పొందుటద్వార కొంత ఆశించిన ఫలితాలు పొందుతారు, ఆత్యాశ కూడదు నిదానంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవచ్చును కావున వేచిచేసే దోరణి తప్పక మేలుచేస్తుంది. వ్యాపారులకు పెద్దల అశీస్శులు అవసరం వాటితో ముందుకు వెళ్తే లబ్దిని పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి వ్యతిరేకవర్గం నుండి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను నెట్టుకురాగలరు.

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తం మీద ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందుట చేత చాలావరకు ప్రశాంతంగా కనిపిస్తారు కాకపోతే చక్కటి ఆలోచనలు అవసరం. ఆర్ధికపరమైన విషయాల్లో సంతృప్తి ఉంటుంది నూతన అవకాశాలు పొందుతారు. నూతన పరిచయాల వలన అవకాశాలు మెరుగుఅవడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో స్వల్ప ఆందోళనలు తప్పక పోవచ్చును జాగ్రత్త. అనుభవజ్ఞుల సూచనలు చాలావరకు ఉపయోగపడుతాయి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులకు బాగాశ్రమను పొందితే ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు ఆస్కారం ఉంది. పోటిపరీక్షల విషయంలో శ్రద్దపెట్టండి. ఉద్యోగులకు చాలావరకు ఆశా భంగం అవుతుంది కావున కొంతకాలం వేచిఉండుట ఉత్తమం. వ్యాపారులకు పనిభారం ఉంటుంది అకారణంగా మాట పడవలసి వస్తుంది తెలివితో వ్యవహరించుట ఉత్తమం. కళారంగంలో ఉన్నవారికి బాగుంటుంది ధనమునకు సంబంధించిన విషయాల్లో సంతృప్తి ఉంటుంది.


ధనస్సు రాశి

ఈవారం మొత్తం మీద శుభకార్యములలో పాల్గొంటారు. సమయాన్ని బంధువులతో,మిత్రులతో సంతోషంగా గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. పనులలో ఒత్తిడిని కూడా కలిగిఉండే అవకాశం ఉంది కావున ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది వాటిపరంగా ముందే జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో అవసరానికి ధనం సర్దుబాటు అవుతుంది కావున ఇబ్బంది ఉండకపోవచ్చును. పెద్దలతో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. మీశక్తి సామర్థ్యాలు చూపించుట ద్వారా నూతన అవాకాశాలు వస్తాయి. విద్యార్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి సమయాన్ని వృధాచేసే ఆస్కారం ఉంది జాగ్రత్త. ఉద్యోగులకు బాగుంటుంది పెద్దల సహకారం లభించుట చేత పనులు పూర్తిఅవుతాయి. వ్యాపారులకు ఆశించిన స్థాయిలో లాభం వచ్చుటకు ఆస్కారం ఉంది బాగుంటుంది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు ముందుకు వెళ్తాయి.


మకర రాశి

ఈవారం మొత్తం మీద ప్రతిపనిని ఆరంభించుటకు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. పెద్దలతో సత్సంభందాలు కలిగిఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబపరంగా ఎటువంటి నూతన ఆలోచనలు చేయకపోవడం అనేది మంచిది. అకారణంగా విబేదాలు,మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాకపోవచ్చును అయినను నిరాశ చెందకుండా కష్టపడితే మంచిఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు పొందుతారు అలాగే సమయపాలన పాటించుట మంచిది. వ్యాపారులకు ఆర్థికపరంగా బాగుంటుంది చిన్న చిన్న ఆటంకాలు కలిగినను చివరకు పూర్తిఅవుతాయి పనులు. కళారంగంలో ఉన్నవారికి ఖర్చులు ఊహించిన స్థాయిలో పెరుగుటకు ఆస్కారం ఉంది కావున జాగ్రత్తగా ఉండుట మంచిది.

కుంభ రాశి

ఈవారం మొత్తం మీద అధికారులతో సమయాన్ని గడుపుతారు వారికి ఆలోచనలు తెలియపరుస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపే అవకాశం కలదు ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. మానసికంగా,శారీరకంగా దృడంగా ఉండుటకు ప్రయత్నం చేయండి అలాగే సమయానికి మంచిభోజనం తీసుకొనే ప్రయత్నం అవసరం. పనులలో ఒత్తిడిని కలిగి ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తే అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు శ్రమ తప్పకపోవచ్చును కాకపోతే ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదు సర్దుకొండి. వ్యాపారులకు నూతన ప్రయత్నాలు ఆరంభించక పోవడం అనేది సూచన. పనులు మందకోడిగా సాగుతాయి నిరాశ తప్పదు. కళారంగంలో ఉన్నవారికి శ్రమకు తగిన గుర్తింపు కొంత ఆలస్యంగా వస్తుంది కావున వేచిచేసే దోరణి ఉత్తమం.


మీన రాశి
ఈవారం మొత్తం మీద అధికారులతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం కలదు వాటి మూలాన గుర్తింపును పొందుతారు. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండుట సహాయపడుతుంది. తలపెట్టిన పనులు కొంత నిదానం అయినను చివరకు విజయవంతంగా పూర్తిచేస్తారు. వారం చివరలో పనిఒత్తిడి తప్పక పోవచ్చును కావున సమయానికి భోజనం తీసుకోండి. శుభకార్యక్రమాలలో పాల్గొనే ఆస్కారం ఉంది. మాటలు ఇవ్వడం ద్వారా వాటిని నిలబెట్టుకోవడం కష్టం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కష్టం తప్పక పోవచ్చును ఫలితాలు ఆశించకుండా మీ భాద్యతను నెరవేర్చుట మంచిది. ఉద్యోగులకు ప్రయాణాల ద్వారా ఇబ్బంది కలుగుతుంది. పనులలో శ్రమను పొందుతారు వాటిని ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారులకు చాలావరకు నష్టం తప్పక పోవచ్చును కావున తెలివితో ముందుకు వెళ్ళుట మంచిది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవాకాశాలు కలుగుతాయి కాకపోతే శ్రమ తప్పదు.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Vinta Jabbulu