Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
duradrushtapu dongalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఫిబ్రవరి 28 - మార్చి 06) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తం మీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వారం చివరలో మాత్రం ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి ఉత్తమం. సోదరులతో చర్చలు చేయవలసి వస్తే వారిఆలోచనలు గమనించి వ్యవహరించుట సూచన. అనుభవజ్ఞుల సలహాలను పాటించుట చేత మేలుజరుగుతుంది. విద్యార్థులకు ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉన్నతమైన ఆలోచనలు చేసి వాటిని సాదించేదిశగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగులకు అధికారులతో మంచి అనుభందం కలిగిఉండుటచేత లబ్దిని పొందుతారు. వ్యాపారస్థులు అనుకూలమైన ఫలితాలు పొందుతారు, పోటీని ఎదుర్కొన్నను ఆశించిన లాభం ఉంటుంది. కళారంగంలోని వారికి ప్రయాణాలు తప్పకపోవచ్చును అదేవిధంగా అనుకూలమైన ఫలితాలే కలుగుటకు ఆస్కారం ఉంది.

వృషభ రాశి

ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను విజయవంతంగా పెద్దల సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి అలాగే నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. ధనమునకు సంబంధించిన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు చేపట్టుట వలన తోటివారికి మేలు జరుగుతుంది. అధికారులతో మంచిసంబందాలు కలిగిఉంటారు. విద్యార్థులకు మంచికాలమే కాకపోతే సమయాన్ని వృధాచేయక ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట ఉత్తమం. ఉద్యోగులకు బాగానే ఉంటుంది తోటవారి సహాకారం పొందగలరు. ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు ఉండే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మరొకసారి ఆలోచన చేయుట మంచిది. కళారంగంలోని వారికి అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడుతాయి.


మిథున రాశి
ఈవారం మొత్తం మీద మొదట్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును కావున జాగ్రత్తగా వ్యవహరించుట అనేది సూచన అలాగే కుటుంబంలో తీసుకొనే ఆలోచనల విషయంలో తొందరపాటు కూడదు. వారంమధ్యనుంచి ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. పనులను సులువుగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. బంధువులతో కలిసి నూతన పనులను చేపడుతారు. పెద్దలను కలిసే అవకాశం కలదు. విద్యార్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శ్రద్ధను కోల్పోకుండా ఉండటం అనేది సూచన. ఉద్యోగులకు అధికారులతో ఇబ్బందులు తప్పక పోవచ్చును సర్దుబాటు ముఖ్యం. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులను చేపట్టుట మంచిది. వ్యాపారస్థులకు ఓపిక అవసరం నిదానంగా ప్రయత్నించి తమ పనులను ముగిస్తారు. కళారంగంలోని వారికి పెద్దల అండదండలు ఉండుట చేత లబ్దిని పొందుతారు అదేవిధంగా నూతన ఆలోచనలు చేస్తారు.


కర్కాటక రాశి

ఈవారం మొత్తం మీద వారం ఆరంభంలో ఆరంభసూరత్వాన్ని ప్రదర్శిస్తారు తర్వాత వాటిపైన అలసత్వం కలిగిఉండే అవకాశం ఉంది జాగ్రత్త. పనులను పూర్తిచేసే విధంగా ప్రణాళికను సిద్డంచేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ప్రయాణాల పరంగా ఇబ్బందులు తప్పక పోవచ్చును కావున వీలైనంత వరకు వాటిని వాయిదవేయుట ఉత్తమం. విద్యార్థులకు సమయపాలన అవసరం పెద్దల సూచనలు పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగులకు అధికారులకు మధ్య సత్సంభందాలు పెరుగుటకు కావాల్సిన చర్యలు తీసుకొనే ప్రయత్నం చేయుట మంచిది నిదానం అవసరం. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి, అలాగే పెట్టుబడలుకు ఇది మంచి సమయం కాదు కావున వేచిఉండుట మేలు. కళారంగంలోని వారికి మాటను పొదుపుగా వాడుట మంచిది లేకపోతే మఖ్యమైన విషయాల్లో నష్టం తప్పదు.


సింహ రాశి

ఈవారం మొత్తం మీద ఆరంభంలో చేపట్టిన పనుల వలన మంచి గుర్తింపును పొందుతారు. అదేపద్దతిని చివరి వరకు కొనసాగించుటలో విఫలం అయ్యే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి విలువైన వార్తను వింటారు. కుటుంబసభ్యుల మధ్య అవగాహన పెరుగుటకు కావాల్సిన చర్యలు తీసుకోండి మంచిది. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు చర్చలలో గుర్తింపు వస్తుంది, పోటీలలో పాల్గొని బహుమతులను గెలుసుకొనే ఆస్కారం ఉంది. ఉద్యోగులకు అధికారులకు మీ ఆలోచనలు తెలియజేయుట మంచిది వారికి అనుగుణంగా నడుచుకోండి. వ్యాపారస్థులకు పనిపైన శ్రద్ద అవసరం అధికమైన శ్రమను పొందితే గాని ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చును కావున ప్రయత్నం అవసరం. కళారంగంలోని వారికి అకారణంగా మాట పడవలసి రావోచ్చును కావున విభేదాలకు దూరంగా ఉండు ప్రయత్నం చేయుట మంచిది.

 

కన్యా రాశి

ఈవారం మొత్తం మీద కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు తెలియ జేసే అవకాశం ఉంది వారి సూచనలు పాటించుట ఉత్తమం. పెద్దలతో మీకున్న పరిచయాలను వాడుకొనే ప్రయత్నం చేయుట మంచిది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పక పోవచ్చును శ్రమను కలిగి ఉంటారు. విద్యార్థులకు మాటలు తగ్గించుకోండి చదువు పై శ్రద్ద అవసరం. ముందు చూపులేని పనులను చేపట్టకండి. ఉద్యోగులకు అధికారులతో ఆలోచనలు పంచుకోండి నిదానం అవసరం. వ్యాపారస్థులకు మాటను నిలబెట్టుకోనుట ద్వారా అనుకున్నవి నెరవేరుతాయి జాగ్రత్త. కళారంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది కాకపోతే పనిఒత్తిడి తప్పక పోవచ్చును.

తులా రాశి

ఈవారం మొత్తం పనులలో ఆటంకాలు కలుగుట వలన నిరాశను పొందుతారు. పెద్దల సహాయసహకారాలు మీరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చును. ధనమునకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పొందుతారు. మీకు నచ్చని పనులను చేయవలసి వస్తుంది కొన్ని విషయాల్లో అసంతృప్తిని కలిగి ఉంటారు. అకారణంగా కోపం వస్తుంది తగ్గించుకొనే ప్రయత్నంచేయుట మంచిది. విద్యార్థులకు సమయానికి భోజనం చేయుట సూచన, శ్రద్ద వహించుట మంచిది. పనులపైన శ్రద్ద చూపుట మంచిది. ఉద్యోగులకు పనిభారం తప్పక పోవచ్చును. అధికారులతో ఇబ్బందులు పొందుతారు. వ్యాపారస్థులకు పెద్దల సహాయసహకారాలు అందుట చేత పనులు చివరినిమిషంలో పూర్తిచేయగలరు. కళారంగంలోని వారికి కుటుంబపరమైన ఆలోచనలు పెరుగుతాయి కావున వారికి సమయాన్ని ఇవ్వడం అనేది సూచన.

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తం మీద ఇష్టమైన పనులను చేపట్టుటకు ఉత్సాహాంను కలిగిఉంటారు. నచ్చని వారివలన ఇబ్బందులు పెరుగుతాయి సర్దుకుపొండి. పనులకు సంభందించిన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు కావున సాధ్యమైనంత వరకు నిదానం మంచిది. స్త్రీ మూలక సమస్యలు తప్పకపోవచ్చును. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రావు కావున వేచిచూసే దోరణి మంచిది. దూరఆలోచన కలిగి ఉండుట ఉత్తమం. ఉద్యోగులకు ప్రయాణాల వలన తిప్పలు, తోటివారితో చికాకులు, పనిబారం బడలిక ఉంటుంది. నూతన ఆలోచనలు చేస్తరు కాకపోతే అనుకూలమైన సమయం కోసం ఆగుట మంచిది. వ్యాపారస్థులకు ధననష్టం కావున జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆగ్నిపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలోని వారికి కొంత సంతృప్తి పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపును కోరుకొనే అవకాశం ఉంది మిత్రులతో మీ ఆలోచనలు పంచుకోండి.


ధనస్సు రాశి

ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులను నిదానంగా పూర్తిచేస్తారు. అకారణంగా విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటలను జాగ్రతగా వాడుట అనేది సూచన. భిన్నమైన ఆలోచనలు కలిగిఉంటారు. నలుగురితో సమాలోచనలు చేసి వాటిని కొనసాగించే ప్రయత్నం చేయుట మంచిది. తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు పొందుతారు. ప్రయాణాల పరంగా జాగ్రత్తలు వహించుట ఉత్తమం. విద్యార్థులకు మంచిసమయం కావున ఉన్నతమైన ఆలోచనలు కలిగిఉండి వాటిని సాదించే దిశగా ముందుకు వెళ్ళండి. పోటీపరిక్షల్లో మంచిఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారులతో గుర్తింపు లభిస్తుంది సంతోషంను పొందుతారు. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టుబడులకు అనుకూలం. కళారంగంలోని వారికి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయట మంచిది.


మకర రాశి

ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. ఉత్సాహంను కలిగిఉండి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు విధానం వలన తప్పక మేలుజరుగుతుంది. విందులలో పాల్గొంటారు సమయాన్ని నచ్చిన విధంగా గడపాలనే తలంపును కలిగి ఉంటారు. చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుభవం అవసరం కావున ప్రణాళిక కలిగిఉండుట మంచిది. నూతన ప్రయత్నాలు చేస్తారు మంచిది. ఉద్యోగులకు అధికారులతో గల అనుభందం ఉపయోగపడుతుంది పనులలో శ్రమను మాత్రం పొందుతారు. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు వస్తాయి వాటికీ అవసరమైన సమయాన్ని ఇవ్వడం సూచన. కళారంగంలోని వారికి గతపరిచయాలు ఉపయోగపడుతాయి అలాగే ధనము విషయంలో ఖర్చు పెరుగుతుంది.


కుంభ రాశి

ఈవారం మొత్తం మీద తలపెట్టిన పనులను చివరకు పూర్తిచేయగలుగుతారు. విలువైన వస్తువులకు సంబంధించి తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. మీ ఆలోచనలు తోటివారిని ఇబ్బందులకు గురిచేసేవిగా ఉండే అవకాశం ఉంది సరిచూసుకోండి. చాలావరకు వచ్చిన ఫలితాలు మీకు సంతృప్తిని కలిగించలేక పోవచ్చును. విద్యార్థులకు ఉన్నతమైన ఫలితాలు పొందుటకు శ్రమయే మార్గమనే విషయం భోదపడుతుంది. ప్రణాళిక అవసరం అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు బాగుంటుంది కాకపోతే అందరిని కలుపుకొని వెళ్ళుట అనేది సూచన. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది తగిన విధమైన ఆలోచనలు చేయుట మంచిది. కళారంగంలోని వారికి ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది.


మీన రాశి

ఈవారం మొత్తం మీద కుటుంబసభ్యులతో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు పెరుగుటకు ఆస్కారం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. అధికారులతో స్వల్ప ఇబ్బందులు పొందుతారు వారికి అనుగుణంగా నడుచుకొండి. సమయానికి భోజనం చేయుట మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి. విద్యార్థులకు ఆరోగ్యం విషయంలో అశ్రద్దచేయకండి. తొందర తొందర వద్దు గాయములు అవుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగులకు కొంత శ్రమపెరుగుటకు ఆవకాశం ఉంది. ఒకపని తర్వాత మరొక పని ఆరంభించుట మంచిది. వ్యాపారస్థులకు బాగుంటుంది కాకపోతే నూతన ఆలోచనలు చేయుటకు ముందు అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మంచిది. కళారంగంలోని వారికి నూతన అవకాశాలు పొందుతారు నలుగురిలో మంచిగుర్తింపును పొందుతారు.



శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
kaburlu cheppukodaaniki