Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pawan do not enter into plitics

ఈ సంచికలో >> సినిమా >>

ఛాలెంజింగ్‌ కృష్ణవంశీ

challenging krishnavamsy

తెలుగు సినీ పరిశ్రమలో క్రియేటివ్‌ దర్శకులన్పించుకున్నవారిలో కృష్ణవంశీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన ట్రాక్‌ రికార్డ్‌ కృష్ణవంశీకి ఉంది. ఆయన మదిలో ఎప్పటినుంచో ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. అదే చిరంజీవితో చేయాలనుకున్న ‘వందేమాతరం’ సినిమా. కాని అది కొన్ని కారణాలవల్ల సాధ్యం కాలేదు.

చిరంజీవి తనయుడితో కృష్ణవంశీ ఇప్పుడు సినిమా చేస్తుండడంతో మెగా అభిమానులలో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. కృష్ణవంశీ ` చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని సినిమా వర్గాలలోనూ అభిప్రాయపడుతున్నారు కొందరు. అలా సినిమాపై పెరుగుతున్న అంచనాలతో, సినిమా మీద ఇంకా ప్రత్యేక దృష్టిపెట్టాలనే నిర్ణయానికి వచ్చాడట కృష్ణవంశీ.

చరణ్‌తో సినిమాని కృష్ణవంశీ ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడని, వేరే సినిమాలతో పోలిక లేకుండా అత్యద్భుతంగా సినిమా ఉండేలా కృష్ణవంశీ కృషి చేస్తున్నాడని అభిజ్ఞ వర్గాల సమాచారం ద్వారా తెలియవస్తోంది. కొంతకాలం నుంచి కృష్ణవంశీ నుంచి ‘అద్భుతం’ అనదగ్గ సినిమాలైతే రాలేదు. ఆ లోటు చరణ్‌ సినిమాతో కృష్ణవంశీ తీర్చుతాడని ఆశించవచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
kajal wants to love