Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
challenging krishnavamsy

ఈ సంచికలో >> సినిమా >>

కాజల్‌కి ప్రేమించాలనే వుందట

kajal wants to love

హీరోయిన్‌ కాజల్‌కి ప్రేమించాలని వున్నా, ప్రేమించడానికి తగినంత తీరిక లేదట. చెల్లెలి పెళ్ళి తన చేతుల మీదుగా చేసిన అక్క కాజల్‌, తన పెళ్ళికి ఇంకా సమయం ఉందని భావిస్తోంది. పెళ్ళి జీవితంలో అత్యంత మధురమైన సంఘటన అని చెప్పిన కాజల్‌, పెళ్ళికి అన్నీ అనుకూలించాక అందరికీ అన్ని విషయాలూ చెప్తానంది.

ఇప్పటికైతే కెరీర్‌ గురించి తప్ప పెళ్ళి గురించి ఆలోచన లేదని స్పస్టంగా చెప్పింది కాజల్‌. ‘నా మనసుకు నచ్చిన కుర్రాడు దొరికితే వెంటనే పెళ్ళి కబురు మీడియాకు ముందు చెప్తాను’ అని కాజల్‌ నవ్వేసింది. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో కాజల్‌ బిజీగా ఉందిప్పుడు. తెలుగులో ‘లక్ష్మీకళ్యాణం’ ఆమెకు తొలి సినిమా. తేజ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఈ సినిమా వచ్చింది.

హిందీలో కూడా కాజల్‌ బిజీగా ఉన్న కాజల్‌, ఏ భాషలో నటించినా ప్రేక్షకులను మెప్పింగలుగుతున్నందుకు ఆనందంగా ఉందని, ప్రేక్షకులు తనను ఆదరిస్తుండడం వల్లే నటిగా ఈ స్థాయిలో ఉన్నానని అంటోంది కాజల్‌. పెళ్ళికి సమయం ఉందని కాజల్‌ చెప్పినాసరే, సినీ తారల పెళ్ళి గురించి సినీ ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి వేరు కదా, అందుకే కాజల్‌ పెళ్ళి గురించిన ఏ గాసిప్‌ వచ్చినా దానికి చాలా క్రేజ్‌ ఏర్పడుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
sunny leone glamor