Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
anr daughter in movies

ఈ సంచికలో >> సినిమా >>

ఆ రహస్య నటుడు ఎవరో?

who is that  secret actor?

క్రియేటివ్‌ దర్శకుల లిస్ట్‌లో గుణశేఖర్‌కి ఖచ్చితంగా స్థానం వుంటుంది. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నప్పటికీ, గుణశేఖర్‌ టాలెంట్‌ని తక్కువగా అంచనా వేయలేం. తన టాలెంట్‌ నిరూపించుకోవడానికి తనే నిర్మాతగా, తన స్వీయ దర్శకత్వంలో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమా కోసం భారీ స్టార్‌ కాస్టింగ్‌ని ఎంచుకున్నాడు గుణశేఖర్‌.

సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమాలో అనుష్క టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా, ఆమెకు జోడీగా సినిమాలో కీలక పాత్రలో హీరో రాణా కన్పించబోతున్నాడు. ఇదిలా వుంటే, గుణశేఖర్‌ ‘గోనగన్నారెడ్డి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించాలని ఎప్పుడో అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. అందుకనే గోనగన్నారెడ్డి పాత్రను ‘రుద్రమదేవి’ సినిమాలో గుణశేఖర్‌ చూపించబోతున్నాడట.

సినిమాలో ఓ ముఖ్య పాత్రగా గోనగన్నారెడ్డి పాత్ర వస్తుందనీ, సినిమాకి ఈ పాత్ర చిత్రీకరణ హైలైట్‌ అవుతుందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. అయితే ఈ పాత్రలో ఎవరికి గుణశేఖర్‌ అవకాశమిస్తున్నాడనేదీ తెలియరాలేదు. ఓ ప్రముఖ నటుడు ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. వివరాలు ఇప్పటికైతే సస్పెన్స్‌.

మరిన్ని సినిమా కబుర్లు