ఈ మధ్యన వచ్చిన పెద్ద చిత్రాలన్నీ విజయం బాట పడుతున్నాయి. బాలక్రిష్ణ-బోయపాటిల "లెజెండ్", మోహన్ బాబు- రాం గోపాల్ వర్మల "రౌడీ"లతో పాటు సంపూర్ణేష్ బాబు-స్టీవెన్ శంకర్ ల "హృదయ కాలేయం" కూడా హిట్టయ్యింది.
ఇది పరిశ్రమకి శుభసూచకం. అయితే తాజా పెద్ద చిత్రం "రేసుగుర్రం" కూడా హిట్ అయితే టాలీవుడ్ లో వేసవి కూడా చల్లబడినట్టు అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు చూసిన వాళ్లు హిట్టు కళ ఉట్టి పడుతోందంటున్నారు.
అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది.
|