Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (మే 02 - మే 08) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద సామాన్యమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని విధంగా ఖర్చులు పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది. సోదరవర్గంతో కలిసి చేసిన ఆలోచనలు కార్యరూపంలోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇష్టమైన పనులకు సమయాన్ని ఇస్తారు వాటిలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. విద్యార్థులకు బాగుంటుంది కష్టపడితే ఉన్నత లక్ష్యాలను సాధించుకొనే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేయండి. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది సమయాన్ని అనవసరమైన విషయాలకు కేటాయించే అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారస్థులకు ఖర్చులు పెరిగినను ఆ స్థాయికి తగిన విధంగా ఆదాయం ఉంటుంది. పూర్తిస్థాయి సమయం ఇవ్వండి మంచిది. కళారంగంలోని వారికి అధికమైన పనిఒత్తిడి ఉంటుంది అలాగే స్త్రీ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాటపడవలసి వస్తుంది.


వృషభ రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఉన్న ఉత్సాహం మధ్యలో ఉండకపోవచ్చును. తలపెట్టిన పనులు నిదానంగా కొనసాగుతాయి ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో సమయాన్ని సంతోషంగా  ఉంది కాకపోతే ధనంవిషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు తప్పక పోవచ్చును. విద్యార్థులు కష్టంగా భావించక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే మేలుజరుగుతుంది. పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో మీకు గల సంబంధాలు ఉపయోగపడుతాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలవు. వ్యాపారస్థులకు పనిఒత్తిడి ఉంటుంది కాకపోతే చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. కళారంగంలోని వారికి నూతన అవకాశాలు వచ్చుటకు ఆస్కారం ఉంది. ఉన్నతమైన పరిచయాలు మీకు కలిసి వస్తాయి.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద మొదట్లో చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినను వాటిని అధిగమించి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తులతో మీయొక్క ఆలోచనలను పంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది అలాగే దైవసంబంధమైన పనులకు సమయాన్ని కేటాయిస్తారు. విద్యార్థులకు ఆలోచనలు వేగంగా మారుతుంటాయి కాకపోతే ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు ఆపరంగా ముందుకు వెళితే మేలుజరుగుతుంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగులకు అధికారులతో కొన్ని కొన్ని విషయాల్లో విభేదించినా చాలావరకు కలిసి పనిచెయ్యుట వలన మేలుజరుగుతుంది. అందరితో అభిప్రాయాలను మాత్రమే పంచుకోండి. వ్యాపారస్థులకు ఒత్తిడి ఉంటుంది నిదానం అవసరం. కళారంగంలోని వారికి పనులలో సమయంను గడిపే అవకాశం కలదు. 


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద మిత్రులను కలుస్తారు వారితో ఆలోచనలు పంచుకుంటారు. బంధువులతో కలిసి చేపట్టిన పనులలో ఊహించని ఖర్చులు కలుగుట వలన కొంత ఆలోచనలో పడుతారు. నూతన ప్రయత్నాల విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పెద్దలతో కలిసి పనిచేయునపుడు వారి సూచనలు పాటించుట వలన తప్పక మేలుజరుగుతుంది. కుటుంబసభ్యులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి పెద్దల సూచనలు లబ్దిని చేకూర్చేవిగా ఉంటవి. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది కాకపోతే నూతన భాద్యతలను మోయవలసి వస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది, పెట్టుబడలు పెట్టకపోవడమే మంచిది. కళారంగంలోని వారికి భాద్యతలు పెరుగుతాయి వాటికీ సమయాన్ని ఇవ్వడం అనేది సూచన.


సింహ రాశి

ఈవారం మొత్తంమీద పనులకు అధికమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు రావడం చేత సంతృప్తిని పొందుతారు. ధనమునకు సంబంధించిన విషయాల్లో మెలుగు ఉంటుంది కావున నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చును. పెద్దపెద్ద వాళ్ళతో పరిచయాలు ఉపయోగపడేవిగా ఉంటవి అలాగే వారితో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు మాటలకు సమయాన్ని వ్యర్థం చేసుకొనే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగులకు బాగుంటుంది ఆశించిన విధంగా బదిలీల విషయంలో స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటారు, ఆదిశగా ప్రయత్నం ముమ్మరం చేస్తారు. వ్యాపారస్థులకు పనిఒత్తిడితో పాటు లాభం కూడా ఉంటుంది. కళారంగంలోని వారికి గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి అవకాశాలు లభిస్తాయి.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద జీవితభాగస్వామి తో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు కొంత సానుకూలత లభిస్తుంది. ప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి రాకపోవడం మంచిది, వేచిచేసే దొరని మంచిది. వాహనములు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. విద్యార్థులకు పెద్దలతో మీ ఆలోచనలు పంచుకోండి ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని ప్రయత్నం చేయుట ద్వారా లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు కాస్తఇబ్బంది కాలమనే చెప్పుకోవచ్చును. అందరిని కలుపుకొని వెళ్ళండి అలాగే అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారస్థులకు మాటతీరు చేతుచేస్తుంది కావున నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు కలవు ఆలాగే మీకంటూ కొన్ని విషయాల్లో తమదైన ముద్రవేయాలనే తలంపును కలిగి ఉంటారు.

 
తులా రాశి

ఈవారం మొత్తంమీద ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్దతీసుకోవాలి అలాగే ఆర్థికపరమైన విషయల్లో ఊహించని విధంగా ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు వారం చివరలో ఆరంభంలో పెద్దగా ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది వాటిమూలన ఖర్చులు కలుగుతాయి. కుటుంబసభ్యులతో నిదానంగా వ్యవహరించుట సూచన. విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును. సరైన నిర్ణయాలు తీసుకోండి లేకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి అధికారులతో కలిసి పనిచేయునపుడు వారిఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది ధనము చివరినిమిషంలో చేతికి అందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి తమఅనుకున్న వారితో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది నిదానం అవసరం. 

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనుల విషయంలో తొందరపాటు వద్దు ప్రణాళికా ప్రకారం ముందుకు వెల్లుటవలన వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. పనులలో శ్రమను పొందుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు నిరాశాజనమైన ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది. అధికమైన శ్రద్ధను కలిగిఉండుట మేలుచేస్తుంది. ఉద్యోగులకు అకారణంగా వివాదములు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటను అదుపులో ఉంచుకొనుట సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించుట సూచన. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టుబడుల విషయంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది సమయం కేటాయించుట ఉత్తమం. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తిఅయ్యే అవకాశం కలదు. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును వాటికి సమయాన్ని కేటాయిస్తారు. దూరప్రదేశాలనుండి వచ్చిన వార్తలు లాభాన్ని చేకూర్చేవిగా ఉంటవి. బంధువులతో కలిసి చేయుపనుల విషయంలో మాత్రం నిదానం అవసరం లేకపోతే అనవసరంగా ధనం నష్టపోయే అవకాశం కలదు. విద్యార్థులకు శ్రమించుట ద్వారా అనుకున్న ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది దానికి ప్రణాళిక తోడైతే విజయం మీదే. ఉద్యోగులకు ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అధికారులతో కలిసి పనిచేస్తారు. వ్యాపారస్థులకు బాగుంటుంది నూతన అవకశాలు లబిస్తాయి. పెట్టుబడులు పెట్టుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి సమయం ముఖ్యమైనది అని గుర్తుంచుకోండి లేకపోతే ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. 


మకర రాశి

ఈవారం మొత్తంమీద మొదట్లో కొంత పనులలో చికాకును పొందిన చివరకు వాటిని అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. మీవైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట చేత నలుగురిలో ఆశించిన విధంగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో కలిసి మీ ఆలోచనలు పంచుకుంటారు. విద్యార్థులకు దూరప్రదేశాలకు వెళ్ళడానికి చేయుప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి నూతన ఉత్సాహంను కలిగి ఉంటారు. ఉద్యోగులకు గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు అవకాశం ఉంది. అధికారులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది చిన్న చిన్న పనుల ద్వారా నలుగురిలో గుర్తింపును తెచ్చుకుంటారు. కళారంగంలోని వారికి వ్యతిరేకమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట మంచిది.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయల్లో బాగుంటుంది. మీరుచేపట్టిన పనులలో అనుకున్న ఫలితాలు కొంత ఆలస్యం అయినను అనుకూలంగానే వస్తాయి. కుటుంబసభ్యులకు మీ ఆలోచనలు తెలియజేస్తారు అలాగే ప్రయాణాలు చేయవలసి రావొచ్చును. పెద్దవాళ్ళతో పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది. బంధువులతో, మిత్రులతో కలిసి చేసిన ఆలోచనలు మంచిఫలితాలు ఇస్తాయి. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు ఆరంభమవుతాయి కాకపోతే సాధ్యసాద్యాలు చుడండి లేకపోతే ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొంత వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి కాకపోతే సర్దుబాటు విధానం తప్పక మేలుచేస్తుంది. నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు చేపడుతారు. వ్యాపారస్థులకు ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది కావున సంప్రదాయ పద్దతి విడవకండి నిదానం మంచిది. కళారంగంలోని వారికి బాగుంటుంది కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని సంతోషంగా గడుపుటకు ఆస్కారం ఉంది.


మీన రాశి

ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుతాయి, చిననాటి మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది.  విందులు, వినోదాలలో సమయాన్ని గడుపుతారు. తలపెట్టిన పనులు పూర్తిఅవుతాయి. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. కుటుంబసభ్యులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు కొంత తడబాటు ఉంటుంది. విద్యార్థులకు శ్రమకుతగ్గ ఫలితం వస్తుంది కావున సమయాన్ని వాడుకోండి. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగులకు స్థిరమైన ఆలోచనలు చేయుట వలన మేలుజరుగుతుంది. క్రిందిస్థాయి వారితో మంచి సంబందాలు ఉపయోగపడుతాయి. వ్యాపారస్థులకు చాలావరకు బద్ధకం పెరుగుతుంది అనాసక్తి వలన నష్టపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్త. కళారంగంలోని వారికి శుభకార్యక్రమాలకు సమయం ఇస్తారు. నలుగురిలో సమయం గడుపుతారు. నూతన ప్రయత్నం మొదలు పెడతారు.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Chicken Masala