Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
completed o manishi katha shoooting

ఈ సంచికలో >> సినిమా >>

థాయ్ లాండ్ లో 'బూమ్ బూమ్'

boom boom in thailand

చలపతి సిని పిలింస్ పతాకంపై భరత్ భూషణ్, మిలన్, రీతూ, చాఛాకటుదీప్ (బ్యాంకాక్ ఫేం) హీరోహీరోయిన్లుగా నగేష్ నారదాశి దర్శకత్వంలో టి.చలపతి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బూమ్ బూమ్'. ఈ చిత్రం తొలి షెడ్యూల్ థాయ్ లాండ్ దేశంలోని పలు లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా...చిత్ర దర్శకులు నగేష్ నారదాశి మాట్లాడుతూ - ''కధానుసారంగా దాదాపు 80శాతం విదేశాలలోనే ఈ చిత్రం షూటింగ్ చేయాల్సి ఉంది. అందుకే థాయ్ లాండ్ లోని అందమైన లొకేషన్స్ లో తొలి షెడ్యూల్ ని జరిపాము. సినిమా ఒపెనింగ్ రోజున విడుదల చేసిన టైటిల్ సాంగ్ ఈ సినిమాకు హైటెల్ గా నిలుస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు బాలకృష్ణ, సతీష్, నరేందర్, హరి మరియు థాయ్ లండ్ లోని 15మంది ఆర్టిస్టులతో వినూత్న సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది'' అని తెలిపారు.

చిత్ర నిర్మాత టి.చలపతి మాట్లాడుతూ - ''అనుకున్నది అనుకున్నట్లుగా ఈ చిత్రాన్ని కధానుసారంగా తెరకెక్కించడం జరిగింది. రెండో షెడ్యూల్ ను ఈ నెలాఖరుకు పూర్తి చేసి, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ చిత్రం పూర్తి ఎంటర్ టైన్మెంట్ తో యూత్ ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం - సుభాష్ ఆనంద్, కొరియోగ్రఫి - హరి, నిర్మాత - టి.చలపతి, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - నగేష్ నారదాసి

మరిన్ని సినిమా కబుర్లు
nitin as hreo in karunakaran movie