Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
legend 50 days celebrations

ఈ సంచికలో >> సినిమా >>

దబ్బింగ్ పూర్తి చేసుకున్న'నే వస్తున్న'

dubbing completed

అజిత్, మీరా జాస్మిన్ జంటగా తమిళం లో సంచలన విజయం సాధించిన ఆంజనేయ చిత్రాన్ని "నే వస్తున్న" పేరు తో తెలుగు  ప్రేక్షకులకు అందించనున్నారు నిర్మాత ఎస్. మురళి రామనాధన్  . ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు చేసుకుంది.

 ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత మురళి రామనాధన్   మాట్లాడుతూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజిత్, నటించిన గొప్ప యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం అద్భుతం గా వుంటుంది. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కు రెడీ అయ్యింది. ఈ నెలాకరుకు ఆడియో ఆవిష్కరణ జరుపుకుని, వచ్చే నెల మొదటి వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అన్నారు.

అజిత్, మీరా జాస్మిన్, కోవై సరళ, మణివన్నన్, జయప్రకాష్ రెడ్డి, పొన్నాంబళం, మున్సూర్, అలీఖాన్,తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ; మణిశర్మ, మాటలు శ్రీ రాం వై, సహ నిర్మాత పరిటాల రాంబాబు, నిర్మాత; మురళీరామనాధన్ ఎస్. దర్శకత్వం; ఎన్. మహరాజన్
 

మరిన్ని సినిమా కబుర్లు
bacchan grand release!