శ్రీ బాపు గారి తర్వాత గుర్తొచ్చే ప్రముఖ కార్టూనిస్టుల్లో శ్రీ జయదేవ్ గారు ఒకరు. శ్రీ జయదేవ్ గారికి గోతెలుగు.కాం తో ఉన్న అనుబంధం, అభిమానం మాటల్లో చెప్పలేనిది. గోతెలుగు.కాం కోసం శ్రీ జయదేవ్ గారు ప్రత్యేకంగా గీసిన కార్టూన్ ఫీచర్ పురాణేతిహాస్యం. విశేష పాఠకాదరణ పొందిన ఈ ఫీచర్ గత వారంతో ముగిసి ఈ వారంతో అదే స్థానంలో "నవ్వుతాలకి" అనే మరో కొత్త కార్టూన్ ఫీచర్ ప్రారంభం కాబోతోందని తెలియజెయ్యుటకు సంతోషిస్తున్నాము. ఇది కూడా మా పాఠకులనెంతో అలరించగలదని ఆశిస్తున్నాము.
|