Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nuvve kaavaali scene

ఈ సంచికలో >> సినిమా >>

‘సత్య`2’లో హాట్‌ ఐటమ్‌ సాంగ్‌

hot item song in satya-2

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో జె.డి. చక్రవర్తి హీరోగా వచ్చిన ‘సత్య’ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. దానికి సీక్వెల్‌ని వర్మ రూపొందిస్తున్నారన్న వార్త సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సంచలనాలు వర్మకి కొత్త కాదు. ఆయన మాట్లాడితే సంచలనం, సినిమా తీస్తే సంచలనం.

‘సత్య`2’ సినిమా గురించి వార్త బయటకు రావడంతోనే సంచలనంగా మారగా, ఆ సినిమాపై భారీ అంచనాలూ వున్నాయిప్పుడు. ఈ సినిమా కోసం ఓ స్పెషల్‌ సాంగ్‌ని వర్మ ప్లాన్‌ చేశారు. సరదాగా సాగుతుందట ఈ స్పెషల్‌ సాంగ్‌. ఈ పాటని ప్రముఖ గాయని గీతామాధురి పాడుతోంది.

కాన్సెప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుందట. సిట్యుయేషన్‌, చిత్రీకరణ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని హిందీ, తెలుగు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వర్మ సినిమాపై వున్న ఆసక్తే ఆ సినిమాకి ప్రచారం ఊరికే లభిస్తుంది. అదే వర్మంటే.

మరిన్ని సినిమా కబుర్లు