Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
husband entry with wife scurt

ఈ సంచికలో >> సినిమా >>

చెర్రీ హీరోయిన్‌ డెడికేషన్‌

cherry heroin dedication

తుపాన్‌’ సినిమాలో రామ్‌చరణ్‌తో నటించిన బాలీవుడ్‌ తార ప్రియాంకా చోప్రా, ఒలింపిక్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న సినిమా కోసం చాలా కష్టపడుతోంది. మేరీ కోమ్‌ ఫీచర్స్‌ తనలో ఉండేలా చూసుకోవడానికి ఎక్కువ సమయం వ్యాయామం చేస్తోందీ అందాల భామ.

కొన్ని రకాల వ్యాయామాలు ఎక్కువగా చేసినట్లయితే అందం చెడిపోతుందనే భయం ఉన్నప్పటికీ, మేరీకోమ్‌పై నమ్మకంతో నాజూకు శరీరాన్ని కండలు తిరిగేలా మలచుకోవడానికి వెనుకాడ్డంలేదు ప్రియాంకా చోప్రా. కాళ్ళ కండరాలు, చేతుల కండరాలు, పొట్ట కండరాలు బిగుతుగా మార్చుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నానని ప్రియాంక చెప్పింది.

మొదట బరువు పెరిగి, ఆ తరువాత తగ్గడం వల్ల కావాల్సిన చోట కావాల్సిన విధంగా శరీరాకృతి లభిస్తుందని ట్రెయినర్‌ సూచించండంతో అలానే చేసిన ప్రియాంక, ఇదివరకు వున్న వెయిట్‌తో పోల్చితే ఇప్పుడు 7 కిలోల వెయిట్‌ తగ్గింది. బరువు తగ్గడం కష్టంతో కూడుకున్న పని అని, అలాగే ఖచ్చితమైన శరీరాకృతి, కండలు తిరిగిన శరీరం కోసం శారీరకంగా చాలా శ్రమ పడాల్సి వచ్చిందని అంటోంది ప్రియాంక.

మరిన్ని సినిమా కబుర్లు
aryaryan rajesh, allari naresh, indraganti mohana krishna combination withe.v.v bandipotu movie