Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dignity of mahesh babu

ఈ సంచికలో >> సినిమా >>

భార్య స్కర్టుతో తెరపైకొచ్చిన భర్త

husband entry with wife scurt

మ్‌షకల్స్‌’ సినిమా కోసం హీరో రితీష్‌ దేశ్‌ముఖ్‌, తన భార్క స్కర్టు వేసుకుని కనిపించనుండడం హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రితీష్‌ భార్య జెనీలియా హిందీతోపాటు, తెలుగు సినిమాల్లోనూ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. ‘హమ్‌షకల్స్‌’ సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించాల్సి రావడంతో రితీష్‌ దేశ్‌ముఖ్‌, సరాసరి తన భార్య వద్దకు వెళ్ళి ఆమె స్కర్ట్‌ ఇవ్వమని కోరాడట.

భర్త అలా అడిగేసరికి భార్య జెనీలియా షాక్‌కి గురైంది. విషయం తెలుసుకున్నాక కడుపారా నవ్వుకుని, తన స్కర్ట్‌లలో ఒకటి సెలక్ట్‌ చేసిచ్చింది భర్త రితీష్‌ దేశ్‌ముఖ్‌కి. జెనీలియా ` రితీష్‌లది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. రితీష్‌ తండ్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెళ్ళికి ముందు కొన్ని ఇబ్బందులు పడ్డా, వారి వైవాహిక జీవితం హాయిగా గడిచిపోతుందిప్పుడు. అన్యోన్య దాంపత్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా రితీష్‌, జెనీలియా జంట గురించి చెప్తారు బాలీవుడ్‌ సినిమా వాళ్ళు.

జెనీలియా స్కర్ట్‌ విషయానికొస్తే, స్కర్ట్‌లో కనిపించాల్సి రావడం వింత అనుభూతి కల్పించిందని రితీష్‌ చెప్పాడు. తన భార్యదీ, తనదీ నడుం కొలత ఒకటేనని అన్నాడాయన. ‘ఇలాగైతే బావుంటుంది’ అని తన భార్య కొన్ని సూచనలు చేసిందని, దానికి తగ్గట్టుగానే స్కర్ట్‌లో కనిపించి నటించాల్సిన చోట నటించానని రితీష్‌ నవ్వుతూ చెప్పాడు.

మరిన్ని సినిమా కబుర్లు
cherry heroin dedication