Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
family trend

ఈ సంచికలో >> సినిమా >>

త్రిపాత్రాభినయం, ఏడుగురు హీరోయిన్లు

,tribul rol ,seven heroyins

‘హృదయకాలేయం’ టైటిల్‌ వినగానే పిచ్చిగా అనిపించింది చాలామందికి. సినిమా ట్రెయిలర్‌ వచ్చాక కూడా మొదట ఎవరికీ ఎక్కలేదు. కానీ, ఇంటర్నెట్‌లో ఈ ట్రెయిలర్‌ రికార్డులు సృష్టించింది. సినిమాలో ఏదో వుంది అనుకున్నారు ట్రెయిలర్‌ చూసినవారు. సినిమాలో ఏముంది? అని సినిమా తర్వాత కూడా కొన్ని విమర్శలు వచ్చినా, సినిమా అంచనాల్ని మించి విజయం సాధించింది.

ఆ క్రెడిట్‌ పూర్తిగా సంపూదే. సంపూర్ణేష్‌బాబు ‘హృదయకాలేయం’ సినిమాతో చాలా పేరు గడిరచాడు. ఆయన అల్లరి నరేష్‌తో ఓ సినిమా చేస్తున్నాడిప్పుడు. దాంతోపాటుగా ‘కొబ్బరి మట్ట’ అనే వెరైటీ టైటిల్‌తో మళ్ళీ ప్రయోగం చేస్తున్నాడు. ఇందులో విచిత్రమేంటంటే సినిమాలో ఏడుగురు హీరోయిన్లు. హీరో కూడా త్రిపాత్రాభినయం చేయడం ఇంకో విశేషం.

‘సినిమా ఎలా వుంటుందో ఇప్పుడే చెప్పను, కానీ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సినిమా తప్పక ఘనవిజయం సాధిస్తుంది. కథాంశం సస్పెన్స్‌’ అన్నాడు సంపూర్ణేష్‌బాబు. ‘వీడు హీరో ఏంటి.?’ అన్నవాళ్ళే నన్ను పొగుడుతూ వుంటే చాలా ఆనందంగా వుందని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. త్రిపాత్రాభినయం, దానికి తోడు ఏడుగురు హీరోయిన్లంటే సినిమా విడుదలకు ముందే ‘హృదయకాలేయం’లా ‘కొబ్బరి మట్ట’తో కూడా సంచలనాలు నమోదు చేయడానికి సంపూర్ణేష్‌బాబు సిద్ధమవుతున్నట్టే కదా.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam