Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meenaa's grand ree entry

ఈ సంచికలో >> సినిమా >>

విద్యాబాలన్‌ తెలుగులో నటించేదెప్పుడు?

when acting midyabalan in telugu movie?

నాగార్జునతో కలిసి నటించాలని వుందనడమే తప్ప, తెలుగులో నటించడానికి తనవంతు ప్రయత్నాలైతే చెయ్యడంలేదు బాలీవుడ్‌ సుందరి విద్యాబాలన్‌. హిందీలో చేసినట్టుగా తెలుగులో ఆమె సినిమాలు చేయడానికి పరిస్థితులు అనుకూలించవు. ఎందుకంటే ఆమెకు పెళ్ళయిపోయింది. పెళ్ళయ్యాక అంత ప్రాధాన్యత వున్న పాత్రలు దక్షిణాది సినిమా  పరిశ్రమలో దక్కడం కష్టమే.

కానీ లేడీ ఓరియెంటెడ్‌ కథలు తప్ప, వేరే కథలైతే విద్యాబాలన్‌ చేయడంలేదు. మలయాళంలో తప్ప, దక్షిణాది నుంచి తనకు తగ్గ పాత్రలు రావడంలేదని విద్యాబాలనే చెప్పింది. అయినాగానీ తెలుగులో నటించాలనే కోరిక మాత్రం తనలో బలంగా వుందని విద్యాబాలన్‌ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళం నుంచి కూడా తనను ఎక్సయిటింగ్‌కి గురిచేసే స్క్రిప్ట్‌లు ఎవరూ చెప్పలేదంటోంది విద్యాబాలన్‌.

వాలకం చూస్తోంటే, విద్యాబాలన్‌కి తెలుగులో నటించడం పట్ల అంత ఆసక్తి లేదేమో అనిపిస్తోంది. ఒకవేళ ఆసక్తి వుంటే, ఆమెతో సినిమాలు చేయడానికి తెలుగులో కథలే లేకుండా పోవు కదా. రెమ్యునరేషన్‌ కూడా విద్యాబాలన్‌ చాలా ఎక్కువే డిమాండ్‌ చేస్తుంది. అంత డిమాండ్‌ ఇచ్చి, ఆమెతో తెలుగులో సినిమా చేయాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది?

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam