Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega-reentry

ఈ సంచికలో >> సినిమా >>

కష్టమైనా ఇష్టంగానే: ప్రియాంకా చోప్రా

Priyanka likes hard work

కొన్ని పాత్రలు కమర్షియల్‌ ఇమేజ్‌ తెస్తాయి. కొన్ని నటిగా గుర్తింపునిస్తాయి. అతి కొద్ది సందర్భాలలో మాత్రమే మనసుకు నచ్చిన పాత్రలు వస్తాయి. అవి జీవితాంతం గుర్తుంచుకునే సంతృప్తిని మిగుల్చుతాయి. అలాంటిదే ‘మేరీకోమ్‌’ సినిమాగా అభివర్ణిస్తోంది హిందీ తార ప్రియాంకా చోప్రా. బాక్సింగ్‌ ఛాంపియన్‌ మేరీకోమ్‌ పేరుతోనే హిందీలో సినిమా రూపొందించారు. అందులో ప్రియాంకా చోప్రా నటిస్తోంది.

నటించడం కాదు, జీవించాను అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఇదివరకే చెప్పిన ప్రియాంకా చోప్రా ఆ మాట నిజమని ట్రైలర్‌ ద్వారానే నిరూపించింది. పాత్రలో ఒదిగిపోవడం, జీవించడం అంటే ఇదే అని ప్రియాంకని అందరూ అభినందిస్తున్నారు. ‘సినిమా ఇంకా విడుదలవలేదు.. ఈలోగా వస్తున్న ప్రశంసలతో ఆనందంగా ఉంది..’ అని తనను అభినందిస్తున్నవారికి థ్యాంక్స్‌ చెప్పి, సినిమా కోసం తానెంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నదీ ఆమె తెలియజేసింది.

‘జీవితంలో ఇలాంటి పాత్ర మళ్ళీ వస్తుందో లేదో.. వస్తుందని నేనైతే అనుకోవడంలేదు..’ అంటూ అమితానందాన్ని పొందుతోంది ప్రియాంకా చోప్రా ‘మేరీకోమ్‌’ సినిమా గురించి చెబుతూ.

మరిన్ని సినిమా కబుర్లు
cherry sky walk