Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Lawrence Movies: musalodu, The Latest

ఈ సంచికలో >> సినిమా >>

రికార్డులు కొట్టేదాకా ‘ఆగడు’

agadu movie records

మహేష్‌బాబు రికార్డులు కొట్టేదాకా ‘ఆగడు’ అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘దూకుడు’ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన మహేష్‌, ‘వన్‌ నేనొక్కడినే’ అనే ప్రయోగాత్మక సినిమాతో రికార్డుల రేసులో కొంచెం వెనుకబడ్డాడుగానీ, ‘ఆగడు’ లాంటి కమర్షియల్‌ సినిమాతో మళ్ళీ రికార్డులు కొట్టడం ఖాయమే అనిపిస్తుందని అతని అభిమానులు అంటున్నారు.

‘ఆగడు’ ట్రైలర్‌ ఇప్పటికే అభిమానులకు బాగా కిక్‌ ఇచ్చింది. గ్యారంటీ హిట్‌ అనే నమ్మకాల్నీ కలగజేసింది. పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తూ ఆడియన్స్‌కి ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేలా మహేష్‌, తన పాత్రలో ఈజీగా చేసుకెళ్ళిపోయాడని సినిమా యూనిట్‌ వర్గాలు కూడా చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. శ్రీనువైట్ల ` మహేష్‌ కాంబినేషన్‌ అంటే అంచనాలు పెరగడం సహజం. అందుకే ఎక్కడా రాజీపడకుండా సినిమాని రూపొందించార్ట.

మహేష్‌ అయితే సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడని సమాచారం. ఇండస్ట్రీ హిట్‌ కొడ్తాననే ధీమా ఆయనలో ఉందట. రికార్డుల పరంగా ఇప్పుడు టాప్‌ ప్లేస్‌లో ఉన్న ‘అత్తారింటికి దారేది’ సినిమాకి ‘ఆగడు’ చెక్‌ పెట్టడం ఖాయమే అని ట్రేడ్‌ వర్గాల్లో కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పోజిటివ్‌ బజ్‌ ఉన్న ‘ఆగడు’ సినిమాకి ఫస్ట్‌ డే గుడ్‌ టాక్‌ వస్తే, రికార్డులు కొట్టేదాకా మహేష్‌ ‘ఆగడు’ అనడం నిస్సందేహం.

మరిన్ని సినిమా కబుర్లు
rhea chakraborty commitment