Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rhea chakraborty commitment

ఈ సంచికలో >> సినిమా >>

నూతన దర్శకుడికి జాతీయ ప్రతిభా పురస్కారాలు.

National merit awards to the new director

"హమ్-తుమ్" అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకులు రామ్ భీమన. మొదటి చిత్రంతోనే వైవిధ్యమైన గుర్తింపుని తెచ్చుకోవడంతో పాటూ ప్రతిభా పుసరస్కారాల్ని అందుకోవడం విశేషం. లండన్ లో మ్యానేజ్మెంట్ చదువు చదివిన రామ్ భీమన, అక్కడి లండన్ ఫిల్మ్ అకాడమీలో దర్శకత్వ కోర్సునికూడా పూర్తిచేశారు. అక్కడే రెండు ఇంగ్లీష్ చిత్రాలకు పనిచేసి, "అయామ్ డెడ్" అనే సినిమాలో నటించిన తరువాత భారతదేశానికి వచ్చేశారు. హైదరాబాద్ వచ్చాక ASL PLZ అనే లఘుచిత్రంతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అభినందనలు, అవార్డులు అందుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికి యూట్యూబ్ లో మూడుకోట్ల వ్యూస్ దాటింది. ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇంత పాప్యులర్ అవడం చాలా అరుదు.

ఈ మధ్యనే దర్శకుడు రామ్ భీమనకు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డెబ్బయ్యవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చిన ప్రతిభా అవార్డు వరించింది. షార్ట్ ఫిల్మ్ నుంచీ ఎదిగి సినిమా తీసిన యువదర్శకులను ప్రోత్సహించడానికి ఎర్పాటుచేసిన ఈ అవార్డును అందుకున్న మొదటి వారిలో రామ్ ఒకరు. దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు, హీరో మోహన్ బాబు చేతులమీదగా ఈ అవార్డుని అందుకున్న రామ్ కి దాసరి గారు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించడం విశేషం.

"అంకురం" అనే సామాజిక సంస్థను స్థాపించి బాధ్యతాయుతమైన పౌరులతో కలిసి సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న రామ్ ని ఈ నెలలో సూర్యకాంతి జాతీయ పురస్కారం వరించింది. జాయినింగ్ హ్యాండ్స్ ఫర్ హెల్పింగ్ సొసైటీ వారు స్థాపించిన ఈ అవార్డును అనంతపురం పట్టణ జిల్లా  పరిషత్ చైర్మెన్ శ్రీ చనమ్ గారు మరియు మేయర్ శ్రీమతి స్వరూప గారి చేతుల మీదుగా లభించింది. ఇప్పుడిప్పుడే ఎదుగు తున్న ఈ యువనవ దర్శకుడికి ఈ పురస్కారాలు ఉత్సాహాన్ని అందించి, పుంజుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాల్ని అందిస్తాడని ఆశిద్దాం. ప్రస్తుతం ఒక భారీ కమర్షియల్ సినిమా స్క్రిప్టుతో సిద్దమౌతున్న రామ్ భీమన

మరిన్ని సినిమా కబుర్లు
Pesarattu 'Movie  start ..!