Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
current

ఈ సంచికలో >> సినిమా >>

దూకుడే దూకుడు

allu arjun

సినీ హీరో అల్లు అర్జున్‌ సినిమాలే కాకుండా, తన ఇమేజ్‌ని ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’గా పని చేయడం ద్వారా కూడా పెంచుకుంటున్నాడు. ‘రేసుగుర్రం’తో కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టాడు బన్నీ. అతనిప్పుడు ‘ఓఎల్‌ఎక్స్‌’ అనే సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తూ, ‘అమ్మేయండి..’ అని తన అభిమానులకు ఆ సంస్థను పరిచయం చేయడం వెరైటీగానే ఉంది.

ఇలా బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడంలో అందరికన్నా ముందున్నాడు హీరో మహేష్‌. పారగాన్‌ అనే చెప్పుల కంపెనీకి తాజాగా ఎండార్స్‌ చేశాడాయన. ఇవి కాక పలు బ్రాండ్స్‌కి సంబంధించిన అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో కనిపిస్తూ, అభిమానుల్ని మహేష్‌ ఉత్సాహపరుస్తుండగా, మహేష్‌ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్‌ కూడా బాగానే ఆర్జిస్తున్నాడు డబ్బునీ, పాపులారిటీనీ.

కోల్గేట్‌ సంస్థ ప్రకటనల్లో హుషారుగా కనిపిస్తూ, అమ్మేయండి అంటూ అల్లు అర్జున్‌ చేస్తున్న హడావిడి అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తోంది. వెంకటేష్‌, నాగార్జున వంటివారు కూడా పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్‌తో పోల్చితే నాగార్జున బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎక్కువ సంస్థల తరఫున పనిచేస్తున్నాడు. తమ ప్రోడక్ట్స్‌కి స్టార్స్‌ పబ్లిసిటీ చేస్తే, బ్రాండ్‌ వాల్యూ పెరుగుతుందని భావిస్తూ, ఆ స్టార్స్‌ అడిగిన మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి వివిధ సంస్థలు.

మరిన్ని సినిమా కబుర్లు
super star angryed