Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
telangana breathe less song

ఈ సంచికలో >> సినిమా >>

అంచనాలు పెంచుకుంటున్నాడు

increasing expectations

మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న యంగ్‌ హీరో వరుణ్‌తేజ, తొలి చిత్రానికి భారీ అంచనాల్ని సంపాదించడంలో సఫలమయ్యాడు. నాగబాబు తనయుడైన వరుణ్‌తేజ, ‘ముకుంద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. హీరోయిన్‌గా ‘ఒకలైలా కోసం’ ఫేం పూజా హెగ్దే నటిస్తోంది.

సాధారణంగా ఓ సినీ కుటుంబం నుంచి, అది కూడా మెగా కుటుంబం నుంచి వస్తున్న హీరో అంటే అంచనాలు ఎక్కువగానే వుంటాయి. ఆ అంచనాల్ని డబుల్‌ చేసుకున్నాడు వరుణ్‌, తన అందంతో, తన హైట్‌, ఫిజిక్‌తో. సినిమా సెట్స్‌ మీదకు రాకుండానే వరుణ్‌ సంచలనాలు సృష్టించే హీరోగా మీడియాలో ప్రొజెక్ట్‌ చేయబడ్డాడు.

శ్రీకాంత్‌ అడ్డాల సినిమాలు వాస్తవానికి దగ్గరగా వుంటాయి. మెగా కాంపౌండ్‌ నుంచి వస్తున్న హీరోని మాస్‌ యాంగిల్‌లో చూస్తారు ఆడియన్స్‌, అభిమానులు. దానికి తగ్గట్టుగానే వరుణ్‌ కూడా క్లాస్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటూనే, మాస్‌ టచ్‌ని ప్రదర్శిస్తున్నాడు. ట్రైలర్స్‌ వరకూ ఫుల్‌ మార్క్స్‌ సంపాదించిన వరుణ్‌, సినిమాతో ఏం చేస్తాడో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam