Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with avika gor

ఈ సంచికలో >> సినిమా >>

లింగ - చిత్ర సమీక్ష

Lingaa - Movie Review

చిత్రం: లింగ
తారాగణం: రజనీకాంత్‌, అనుష్క, సోనాక్షి సిన్హా, జగపతిబాబు, కె.విశ్వనాథ్‌, సంతానం, కరుణాకరన్‌, దేవ్‌ గిల్‌, ఫాల్క్‌ కొలంబో, లారెన్‌ ఇర్విన్‌, విలియమ్‌ ఒరెండార్ఫ్‌, బ్రహ్మానందం తదితరులు
చాయాగ్రహణం: రత్నవేలు
సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌
నిర్మాణం: రాక్‌ లైన్‌ ప్రొడక్షన్స్‌, ఇరోస్‌
దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌
నిర్మాత: రాక్‌లైన్‌ వెంకటేష్‌
విడుదల తేదీ: 12 డిసెంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
లింగా (రజనీకాంత్‌), తన స్నేహితులతో (సంతానం, కరుణాకరన్‌ తదితరులు) కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. ఓ సందర్భంలో లింగాకి లక్ష్మి (అనుష్క) కలుస్తుంది. తనతోపాటు లింగని లక్ష్మి ఓ ఊరికి తీసుకెళ్తుంది. అక్కడే లింగకి తాను రాజా లింగేశ్వర (రజనీకాంత్‌)కి మనవడిననే విషయం తెలుస్తుంది. 70 ఏళ్ళుగా మూతపడ్డ ఓ దేవాలయాన్ని లింగతో తెరిపించాలనుకుంటుంది లక్ష్మి. అయితే తనను అనాధగా మిగిల్చిన తాతపై కోపంతో, ఆ పనికి ఒప్పుకోడు లింగా. కానీ పరిస్థితులు అతన్ని తిరిగి సొంతూరికి వెళ్ళేలా చేస్తాయి. అవేంటి? తాతగారి కోరికను మనవడు నెరవేర్చాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే:
వయసు మీద పడినా ఆన్‌ స్క్రీన్‌ రజనీకాంత్‌ ఎనర్జీలో తేడా రాలేదు. తాత, మనవడి పాత్రల్లో రజనీకాంత్‌ ఒదిగిపోయాడు. పాత్రకు అవసరమైనంత ఎనర్జీని చూపించి, సినిమాకి అన్నీ తానే అన్పించాడు. అనుష్క సహజంగానే అందంగా కనిపించింది. తన పాత్రకు తగిన న్యాయం చేసింది. నేచురల్‌ బ్యూటీ సోనాక్షి కూడా పాత్రకు తగ్గట్టుగా నటనను ప్రదర్శించింది.

సంతానం తన మార్క్‌ కామెడీతో నవ్వించాడు. కరుణాకరన్‌ ఓకే. కె.విశ్వనాథ్‌ మామూలే. జగపతిబాబు తన పాత్రకు సరిగ్గా సూటయ్యాడు. ఫాల్క్‌ కలంబో ఓకే. లారెన్‌ ఇర్విన్‌, విలియన్‌ ఓరెండార్ఫ్‌ తదితరులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటనా ప్రతిభతో ఆకట్టుకుంటారు.

కమర్షియల్‌ ఫార్ములాతో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌, ఈ సినిమాలోనూ ఎక్కడా ఫార్ములా మిస్‌ అవలేదు. డిఫరెంట్‌ స్టోరీ కాకపోయినా, ప్రెజెంటేషన్‌ విషయంలో రిచ్‌నెస్‌ని నమ్ముకున్నాడు. నరేషన్‌ ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రిప్ట్‌ సాధారణంగా వున్నా, స్క్రీన్‌ప్లే ఎనర్జిటిక్‌గా వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి తగ్గట్టుగా వుంది. మూడు పాటలు తెరపై చూడ్డానికి చాలా అందంగా వున్నాయి. గ్రాఫిక్స్‌ సినిమాకి అదనపు బలం. ఎడిటింగ్‌ బావుంది. కాస్ట్యూమ్స్‌ రిచ్‌గా వున్నాయి. బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైన రీతిలో పనిచేసింది.

అనేక వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా, ప్రధమార్థం కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌తో నడిచిపోతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఓకే. సెకెండాఫ్‌లో సినిమా మరింత పవర్‌ఫుల్‌ ఫేజ్‌ని అందుకుంటుంది. ఎనర్జిటికిగ్‌గా సినిమా అంతటా రజనీకాంత్‌ కనిపించడం సినిమాకి పెద్ద ప్లస్‌. రజనీ ఫాన్స్‌ని సినిమా అలరిస్తుంది. బాక్సాఫీస్‌ వద్ద తొలిరోజు మంచి ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న సినిమా, పాజిటివ్‌ టాక్‌ కూడా దక్కించుకోవడంతో బ్లాక్‌ బస్టర్‌గా మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే:
రజనీ ఫాన్స్‌ని ‘లింగా’ ఖుషీ చేస్తాడు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka