తెలుగు వారి భోజనమంటే కళ్ళల్లో మెదిలేదీ, నోరూరించేదీ విస్తరి నిండా వడ్డించిన షడ్రసోపేతమైన భోజనం. గోతెలుగు కూడా సాహితీ ప్రియులకు ఇష్టమృష్టాన్న భోజనం లాంటిదే... అందుకే ప్రతి వారం కనువిందు చేస్తూ, అలరిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే త్వరలో మరిన్ని మంచి శీర్షికలకు చోటు కల్పించబోతున్నాం. అవేమిటో , ఎలా ఉండబోతున్నాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదూ. రాబోయే కొత్త సంవత్సరంలో క్రొంగొత్త రూపు సంతరించుకోబోయే గోతెలుగు మిమ్మల్నింకా అలరించనుందని సంతోషంగా తెలియజేస్తూ
మీ
బన్ను
|