Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాల్గవ భాగం

అన్నపూర్ణేశ్వరి కళ్ళెర్రజేసి మనవడిని చూసింది. "ఒరే, రారా...లోనకు రా...!"అంటూ పెద్దగా అరిచింది..
"అదికాదు అమ్మమ్మా...అసలేమైందంటేనూ..."
"ముందు నువ్వు లోనకు రారా...వచ్చి ఇక్కడ నిలబడి నీ సమాధానం చెప్పు..."
తప్పదన్నట్టు లోనకొచ్చాడు నవీన్. ఎందుకైనా మంచిదని ఆవిడ చేతికి అందనంత దూరం లోనే నిలబడ్డాడు. సందేహం అక్కర్లేదు. తప్పు చేసాడని తెలిస్తే ఇప్పటికీ మనవడి చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. "ఏరా సిగరెట్లు కాలుస్తున్నావా?" అడిగింది.
"లేదు " అన్నాడు.
"అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు అమ్మమ్మా..! ఈ సిగరెట్  పెట్టె ఎక్కడిదో అడుగు..?" అంటూ తన చేతిలోని పాకెట్ ను అమ్మమ్మ చేతిలో పెట్టింది మహేశ్వరి.
"ఎక్కడిదిరా ఇదీ"అడిగిందామె.
"నీకేం తెలుసు, తెచ్చింది మహీ.దాన్నే అడుగు"
"అమ్మమ్మా!నేనేమన్నా దుకాణం నుంచి కొనుక్కొచ్చానా!అన్నయ్య జేబులోంచే గదా తీసాను"
అంది గారాబంగా మహేశ్వరి.
"అర్థమైంది, సిగరెట్లు కాల్చే  అలవాటు మన ఇంటా వంటా లేదు. నీ మావయ్యను చూసైనా బుద్ధి తెచ్చుకోరా...అమెరికాలో గొప్ప డాక్టరు. ఇంత వయసొచ్చినా ఒక్క సిగరెట్టు కాల్చడు. నీ పెద్ద మావయ్యను చూడు. వాడు సిగరెట్ కాల్చడం ఎప్పుడన్నా చూశావా?"
"తప్పు చేసే వాళ్ళను నేను చూడను. నాకే పాపం తెలీదు. ఆ సిగరెట్ తో నాకు సంబంధం లేదు. "
"ఇలా నిజం చెప్పవు గానీ వెళ్ళి గోడకు నిలబడి చేతులెత్తు. వెళ్ళు నే వచ్చేవరకు అలాగే నిలబడు. త్వరగా"
ఆమె ఆర్డరంటే తిరుగులేనిది. గోడకు నిలబడి రేండు చేతులూ పైకెత్తాడు. ఆమె పెరటివైపు వెళ్ళింది.
"ఏయ్ మహీ...అనవసరంగా నన్నిరికించావేమిటే...ప్లీజ్..

మా చెల్లాయి కదూ...బుజ్జి కదూఒ...ఏదో చేసి కాపాడవే..."లో గొంతుకతో చెల్లెల్ని అర్థించాడు.
"అలా రా దారికి..."అంటూ వలుజడ ముందుకేసుకుని దగ్గరకొచ్చి విజయవిలాసంగా కళ్ళెగరేసింది. ""ఇప్పుడు చెప్పుమరి, సిగరెట్టు కాలుస్తున్నావా?"అడిగింది.
"నీమీద ఒట్టు, సరేనా? నాకా అలవాటు లేదు."
"మరి ఈ పాకెట్ నీ షర్టు జేబులోకి ఎలా వచ్చింది? "
"అదేమరి.ఆగోపిగాడు వాళ్ళ తాతాయ్య వస్తున్నాడని కంగారులో నాజేబులో పడేశాడు. తర్వాత దీని సంగతి మర్చిపోయా.అది కాస్తా నీకంటపడింది. "
"నిజంగానా?"
"అవునంటున్నాగా "
"అలాగా...ఓకే...సిగరెట్టు కాల్చే ఫ్రెండ్స్ ని వదిలేస్తానని మాటివ్వు. నిన్ను పంప్మించేస్తాను.
"అదెలా...ఏఏలోకం లో ఏ అలవాటు లేని మనిషి వుండ్దూ.అలాగని వదిలేయడం మొదలుపెడితే ఒక్క ఫ్రెండూ మిగలడు."
"వదిలేస్తావా,లేదా...?
"సరే...వదిలేస్తాను...."
"అయితే వెళ్ళిపో..అమ్మమ్మకి నేను చెప్పుకుంటాను. త్వరగా వెళ్ళిపో..."
"బ్రతికించావ్ తల్లీ..."అంటూ అక్కడినుంచి వేగంగా వెళ్ళిపోయాడు నవీన్.
అతను వెళ్ళిన వెనకే హాల్లోకొచ్చిన అన్నపూర్ణేశ్వరికి తీరిగ్గా కూర్చున్న మనవరాలు కనిపించింది.
గోడ దగ్గర మనవడు కనబడలేదు.
"ఎక్కడే వాడు...న మాట కాదని వెళ్ళిపోతాడా...వాడి సంగతి చెప్తా..."అంది కోపంగా.
"అమ్మమ్మా. వాడి తప్పు లేదని తెల్సింది. అందుకే పంపించేసా.ఆకలిగా ఉంది.తినడానికి ఏమన్నా పెట్టు" అంది మహేశ్వరి.
"వాతలు పెడతా...వాడు బతిమాలుకోగానే అన్నమీద జాలి పుట్టుకొచ్చిందా?సిగరెట్టు తాగడం ఎంత ప్రమాదమో తెలుసా...?వాడిని కాదు, నిన్ననాలి.."
"అబ్బా ..నా మాట విను అమ్మమ్మా..అసలు విషయం చెప్పడుగా.మంచిపనులు చేస్తున్నవాళ్ళని మనం అభినందించాలి."
"సిగరెట్టు కాల్చడం మంచిపనా?"
సిగరెట్ అలవాటు మంపించడం మంచిపని.మన్వూళ్ళో చదువుకున్న కుర్రాళ్ళంతా సంఘంగా ఏర్పడి ఊరిలో చుట్ట, బీడీ, సిగరెట్టు అలవాటు మాంపించడం కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, పొగ తాగితే ఏర్పడే నష్టాలు వివరిస్తున్నారు. అన్నయ్య ఈ సంఘానికి నాయకుడు. ఇప్పటికే వీళ్ళు చాలామందిచేత ఈ అలవాటు మానిపించారు."
"అలాగా..నాకు తెలీదే"
"ఎలా తెలుస్తుంది?మంచిపనికి గుర్తింపు రావడం కష్టం కదా..ఆ సిగరెట్ పాకెట్ అన్నయ్య జేబులో చూసి నేనే పొరపాటు పడ్డాను.నిజానికది సిగరెట్ల వ్యతిరేక ప్రచార ఉద్యమం లో నలుగురికీ చూపించడం కోసం ఉంచిందట  "
"ఇదంతా నిజమా, కట్టుకథా..?"
"అన్నయ్య గురించి అబద్ధం చెప్పల్సిన అవసరం నాకేంటి? అయినా నాకైతే బుద్ధి లేదు. పొరపాటు పడి అన్నయ్య మీద ఏదో చెప్పాననుకో. ఆ మాత్రానికే చెట్టంత మనవడ్ని గోడకు నిలబెడతావా?"అంటూ దబాయిస్తున్న మనవరాలి తల మీద ఒక్క మొట్టికాయ ఇచ్చి, ముచ్చటగా నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి.
"ఇంకెప్పుడూ వాడిని వెనకేసుకు రాకు.నిజంగా వాడు సిగరెట్లు తాగుతున్నాడని తెలిస్తే నీకు పడతాయి వాతలు. వెళ్ళు" అంది నవ్వుతూ.
"నువ్వు అమ్మమ్మవి కాదు పెద్ద రాకాసివి"అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం ఓ పిచ్చి నవ్వు విసిరి ఎలా వచ్చిందో , అలా తూనిగలా జారుకుంది మహేశ్వరి.
పిల్లల మనస్తత్వం అన్నపూర్ణేశ్వరికి బాగా తెలుసు. వాళ్ళని ఎలా అదుపులో ఉంచాలో కూడా తెలుసు.అయితే మనవలు,మనవరాళ్ళలో అప్పుడప్పుడూ కనిపించే తిరుగుబాటుధోరణి ఆమెకు బాధగా ఉంటుంది.పిల్లలు ఎప్పుడూ తమ ఆజ్ఞల్లోనే,కనుసన్నల్లోనే ఉండాలని కోరుకోవడం కూడా స్వార్థమే అవుతుంది.పిల్లలకూ కొంత స్వేఛ్ఛనీవ్వలి. ఈ స్వేఛ్ఛ పెడ్దోవ పట్టి పాడవకుండా, జాగ్రత్తలు తీసుకోవాలి.
తను వున్నంత వరకు  వీళ్ళని అదుపు చేయగలదు. చెడు అలవాట్లు, చెడు పద్ధతుల వైపు ఆకర్షితులు కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలూ తీసుకోగలదు. కానీ తర్వాత పరిస్థితి ఏంటి?కంటికి రెప్పలా వీళ్ళందర్నీ చూసుకునేదెవరు? తరతరాల వారసత్వంగా వస్తున్న మన తెలుగు సంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు క్రమమంగా తరిగిపోతున్నాయి. చుట్టూ మారిపోతున్న ప్రపంచ వాతావరణం లో మనదైన శైలిలో మన పిల్లల్ని గర్వపడేలా ఉత్తమ ఆంధ్రా పౌరులుగా తీర్చి దిద్దడం ఎంతవరకూ సాధ్యం? తనలాంటి పాతతర్మ్ వాళ్ళను ఎందరినో కలవరపరుస్తున్న సమస్య ఇదే. అమ్మానాన్నల చదువుల్ని అటకెక్కించి, మమ్మీ డాడీ చదువులకు పట్టం కడుతున్నారు.
తనయితే అదృష్టవంతురాలేగానీ ధనిక కుటుంబాల్లో     కూడా చూసే వాళ్ళు లేక వృద్ధాశ్రమాల పాలవుతున్న పెద్దల గురించి వింటూంటే మనసు వేదన పడుతుంది.
డబ్బు సంపాదన కోసం పరుగులు తీసే పోటీ ప్రపంచం లో కొడుకులు, కూతుళ్ళు మనవలు,మనవరాళ్ళకు దూరమై, పలకరించే అత్మీయులు కరువై అందరికీ దూరంగా అనాధల్లా ఆశ్రమాల్లో బ్రతకటం కటకటా...ఎంత దుర్లభం..?
స్వార్థం వెర్రితలలు వేసి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకొని, మనిద్దరం,మనకిద్దరు అనే కొత్త వ్యవస్థ వచ్చింది.దీని పర్యవసానంగా వృద్ధాప్యంలో అడుగు పెట్టిన వాళ్ళను చూసీ, పట్టించుకునేవాళ్ళు కరువై పోతున్నారు. బిడ్డల్ని కని పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగాల్లో స్థిరపరిచి, ఇలా జీవితమంతా కుటుంబం కోసం బిడ్డల కోసం తమ జీవితాన్ని ధారపోసిన వృద్ధ దంపతులకు రెక్కలొచ్చిన ఆ బిడ్డలు దూరమై తమను పట్టించుకోకపోతే , వాళ్ళు పడే వేదన వర్ణనాతీతం. అందులోనూ దంపతుల్లో ఒకరు పోయి, ఒంటరిగా మిగిలిన వారి పరిస్థితి మరీ దుర్లభం. అంతా ఉండి కూడా ఎందుకీ ఒంటరి బ్రతుకు భగవంతుడా అని చావు కోసం ఎదురుచూస్తున్న వృద్ధుల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.
ఈ పరిస్థితి పూర్వం పట్టణాల్లోనే   ఉండేది. ఇప్పుడీ విష సంస్కృతి  పల్లెటూళ్ళకూ పాకుతోంది.డబ్బు సంపాదనలో పరుగులు తీస్తున్న మనిషికి మనం ఎటు పోతున్నాం అని క్షణం ఆలోచించే తీరిక కూడా చిక్కడం లేదు.
చిన్న కుటుంబ వ్యవస్థలో..ఈరోజు అదుపు తప్పిన పిల్లలతో ఎన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయో చూస్తూనే వున్నాం. ఉమ్మడి కుటుబ వ్యవస్థలో ఇంట్లో పెద్దవాళ్ళకు పిల్లల మీద అదుపు ఉండేది. పిల్లలు ఏం చేస్తున్నారు? టైం కి స్కూల్ కి వెళ్ళివస్తున్నారా?క్రమం తప్పకుండా ట్యూషన్లకు వెళ్తున్నారా?వేళకు తిండి తింటున్నారా?వాళ్ళ స్నేహితులు ఎవరు? మంచివాళ్ళేనా? బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు?

చెడు సావాసాలు ఏమన్నా ఉన్నాయా? ఇలా ఆయా సందర్భాల్ని బట్టి పిల్లల మీద నిఘా వుంచి, తప్పు చేస్తే నయానో, భయానో, సరిదిద్ది క్రమ పద్ధతిలో పెంచేవారు. ఇలా నాయనమ్మలు, తాతయ్యలకు అన్యోన్యంగా సంబంధాలు ఉండేవి.
సాధారణంగా పదోతరగతి వరకు పిల్లల మీద తల్లిదండ్రులకు అదుపు ఉంటుంది. ఇంటర్ నుంచి పిల్లల్లో స్వతంత్ర భావాలు ఆరంభమవుతాయి.ఈ వయసులో చేసే స్నేహాలు, అలవాట్లే అవి మంచివి అయినా, చెడువయినా, పిల్లలమీద అధిక ప్రభావం చూపిస్తాయి.టెంత్ వరకూ క్లాస్ ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న పిల్లలు కూడా ఇంటర్ నుంచి గాడితప్పి జీరోలయ్యే ప్రమాదమూ ఉంది.దురదృష్టవశాత్తూ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగ బధ్యతల్లో వుంటే, పెద్దలెవరూ ఇంట్లో లేకుంటే ఇక పిల్లల మీద అదుపు పూర్తిగా పోతుంది.కాలేజీకి వెళ్ళిన పిల్లలు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు పోయినా, కాలరెగరేసి అమ్మాయిల వెంట పడుతున్నా,మరో అడుగు ముందుకేసి చెడు స్నేహాలతో కొకైన్, చెరస్ వంటి మాద్క ద్రవ్యాలకు అలవాటు పడుతున్నా పట్టించుకునేవాళ్ళుండరు. తమ పిల్లలు బుద్ధిమంతులు, సక్రమంగానే చదువుతున్నారన్న గుడ్డి నమ్మకం తో తల్లిదండ్రులు ఉపేక్షించడంతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. తర్వాత లబోదిబోమన్నా లాభం ఉండదు.
మనిషికున్న అనేక బాధ్యతల్లో డబ్బు సంపాదన కూడా ఒక బాధ్యత. అంతేగానీ డబ్బు సంపాదన ఒక్కటే బాధ్యత కాదు. డబ్బుంటే అన్నీ ఉన్నట్టే అనే ధీమా చాలామందిలో కనిపిస్తూంటుంది. ఇది చాలా పొరబాటు. డబ్బుతోబాటు ఉండాల్సినవి ఇంకా చాల ఉన్నాయి. అవన్నీ వుంటేనే నిండయిన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపినట్టు లెక్క.
ఇవాళ వృద్ధులైన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలనే ఇంగితం కొరవడుతోంది. దీని ఫలితంగా నేడు తమ తల్లిదండ్రులు పడే బాధకన్నా రెట్టింపు బాధల్ని భవిష్యత్తులో తాము అనుభవించాల్సి వుంటుందని తెల్సుకోలేక పోతున్నారు. మన దేశం గురించి, మన ఆచార వ్యవహారాల గురించి, మన కట్టుబాట్ల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆచరణలో వాటికి నూరోవంతు కూడా ప్రాధాన్యం ఇవ్వలేక పోతున్నాం.
వృద్ధులైన మాతపితలను కావడిలో మోసుకుంటూ ఎన్నో పుణ్య క్షేత్రాలు తిప్పి చూపించిన సుపుత్రుడు ఒకడైతే, తండ్రి ఆనతికి కట్టుబడి తల్లి శిరస్సునే నరికి తండ్రి వరంతో తల్లిని బ్రతికించుకున్న తనయుడొకడు.  
తండ్రి వరించిన కాంతతో ఆయన వివాహం జరిపించడం కోసం ఆజన్మ బ్రహ్మచారిగా చరితార్థుడైన భీష్ముడు ఒకడయితే, తండ్రి మాట నిలపడం కోసం భార్యంతోనూ, సోదరునితోనూ కలిసి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన ఆదర్శమూర్తి ఒకడు. అంతెందుకు? తన యవ్వనాన్ని తృణప్రాయంగా భావించి తన తండ్రికి దానమిచ్చి ఆయన వృద్ధ్యాప్యాన్ని తను సంతోషంగా స్వీకరించిన ఉత్తమ కుమారుడిని చూసిన పుణ్యభూమి ఇది. ఇదంతా చెప్తే, వీటిని పుక్కిట పురాణాలుగా కొట్టిపారేసే కుసంస్కృతి మన జాతిని ముందుకు నడిపించే యువతరం లో బాగా ప్రబలిపోయింది. వాటిని పక్కన పెట్టడం వల్లే యువత పెడదోవ  పట్టి ఆఖరికి మన సంస్కృతి కూడా సంకరమైపోతున్న దురవస్థ దాపురించింది. రాయప్రోలు ఏమన్నారు? ఏదేశమేగినా, ఎందుకాలిడినా నీ మాతృభూమిని పొగిడి, నీ జాతి నిండు గౌరవాన్ని చాటి చెప్పమన్నారు. కానీ మన వాళ్ళు చేస్తోందేమిటి? ఏ దేశం వెళితే ఆ దేశంలో వాళ్ళ సంస్కృతికి అలవాటు పడి మాతృభూమిని విస్మరిస్తున్నారు. ఇది క్షంతవ్యం కాదు. నేను భారతీయుడ్ని.తెలుగువాడిని అని చెప్పుకుంటే సరిపోదు.విదేశీ సంస్క్ర్తిలో కూడా నీ స్వదేశీ సంస్కృతిని చాటిచెప్పేలా నీవు నీవుగా ఉండాలి. నీ పిల్లల్ని ఉంచాలి. అప్పుడే తెలుగు జాతి గర్వపడుతుంది.
అయినా తన పిచ్చిగానీ, విదేశాల సంగతి అలా ఉంచితే, అసలు ఇక్కడ సంగతేమిటి? పూర్వం నగరాపలకు, పల్లెలకు జీవన సరళిలో వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపించేది. క్రమేపీ ఆ వ్యత్యాస రేఖ చెరిగిపోతోంది. అలాగని నగరాలు నగరాలుగానూ, పల్లెలు పల్లెటూళ్ళుగానే ఉండాలని నాఉద్దేశం కాదు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాల్సిందే. అయితే నగరాల పిచ్చి సంస్కృతులు నాగరికత పేరిట పల్లెలకూ వ్యాపించి యువతను భ్రష్టు పట్టించడం బాధ కల్గించే అంశం. రాను రాను చదువులకిస్తున్న ప్రాధాన్యత సంస్కారానికి ఇవ్వడం లేదు. అందుకే ఈరోజు యువతలో నేర ప్రవృత్తి, ధిక్కార ధోరణి, దుర్వ్యసనాలకు బానిసలుగా మారడం వివాహ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం లాంటి ప్రమాదకర ధోరణులు ప్రబలిపోతున్నాయి.
ఇదే సమస్య గురించి ఆలోచిస్తూ అన్నపూర్నేశ్వరి అక్కడ హాల్లోనె చాలాసేపు ఒంటరిగా కూర్చుండిపోయింది. అంతలో పక్కింట్లోంచి భ్రమరాంబ లోనకు రావడంతో ఆవిడ ఆలోచనలు చెదిరిపోయాయి. పెద్ద స్టీలు కారేజీ ఒకటి తీసుకుని వస్తోందామె.  ముఖం లో విసుగు కనిపిస్తోంది.
 "ఆ కారేజీ ఏమిటి" లేచి కూతురికి ఎదురు వస్తూ అడిగింది.
"మా చిన్నత్తగారు జున్ను పంపించారు. లోనపెట్టు" అంటూ కారేజ్ టీపాయ్ మీద ఉంచి సోఫాలో కూర్చుంది భ్రమరాంబ.
"అలా వున్నావేమమ్మా?"ఎదురుగా కూర్చుంటూ అడిగింది.
"ఎలా ఏమిటి? వీళ్ళతో వేగలేక చస్తున్నాను. వాళ్ళిద్దరికీ నువ్వు భయం చెప్పకపోతే బాగుండదు. చెప్తున్నాను"
"ఎవరిద్దరే?"
"ఇంకెవరు? నీ మనవడు, మనవరాలూనూ..."
"ఇప్పుడేగా, ఇక్కడ్నుంచి వచ్చారు?"
"వచ్చారు, ఇల్లు పీకి పందిరిరేయడానికి. తామింకా చిన్నపిల్లలమనుకుంటున్నారు. ఎప్పుడు చూడు గిల్లికజ్జాలు. ఆదివారాలు కూడా కాలేజి ఉంటే ప్రాణం హాయిగా వుండేది."
"ఇంతకీ ఏం చెశారో చెప్పవేమిటీ?"
"ఇక్కడి నిండి వస్తూనే టి.వి. గోల మొదలైంది. వాడేమో క్రికెట్ చూడాలంటాడు. అదేమో సినిమా చూస్తనంటుంది. చానెల్ మార్చడం లో ఇద్దరికీ  పోటీ. అమ్మమ్మ ఇంట్లోకెళ్ళి ఒకళ్ళు టి. వి. చూడండ్రా అంటే వినరు. నీతో వేగలేరట. గొడవ పడుతూనే వున్నారు. నేనిలా వచ్చేశాను. ఇంట్లో వున్నారంటే సంత గోల చేస్తారు. " అంటూ అసలు విషయం చెప్పింది భ్రమరాంబ. 

మరిన్ని సీరియల్స్
bairagi - bvs rama rao