తెలుగు అక్షరం, తెలుగు లక్షణం, తెలుగు సంస్కృతులపై మక్కువ ఉన్న ప్రతీ పాఠకుడు గోతెలుగు పట్ల చూపిస్తున్న అభిమానం వారం వారం ద్విగుణీకృతం కావడం సంపాదకవర్గానికి, రచయితలకు, చిత్రకారులకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తోంది. విశాల భూమండల పర్యంతంగా ఉన్న తెలుగు వారెందరో ఆయా దేశాలనుంచి మన పత్రికను చదవడం, అభిప్రాయాలు వెలిబుచ్చడం, తమ రచనలతో ఈ తెలుగు సాహితీ యజ్ఞంలో పాలుపంచుకుంటామనడం నిజంగా వెయ్యేనుగుల బలమే. మీరిచ్చే ఈ ప్రోత్సాహం వల్ల మాలోని ఉత్సాహం దినదిన ప్రవర్ధమానం కావాలని, ఇప్పుడిప్పుడే బోసినవ్వులు మొదలుపెట్టిన గోతెలుగు అనతి కాలంలోనే హర్షధ్వానాలు చేయాలని తెలుగు భాషా మతల్లిని కోరుకుంటూ...
|
|
బన్ను |
సిరాశ్రీ |
|