Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

చేతిలో సిగరెట్టు.. అవార్డుకి గురిపెట్టు

target award with cigarette in hand

కమర్షియల్‌ సినిమాలకీ, అవార్డు సినిమాలకీ చాలా తేడాలుంటాయి. కమర్షియల్‌ సినిమాల్లో నటించినా పేరొస్తుంది. అవార్డు సినిమాల్లో నటించినా పేరొస్తుంది. వచ్చే పేరులోనే తేడా. అవార్డు సినిమాల్లో తెచ్చే పేరు ఒక్కోసారి పాపులారిటీ పెంచుతుంది. ఆ పాపులారిటీ ఓ రేంజ్‌లో వుంటుంది. కమర్షియల్‌ ఇమేజ్‌ అలా కాదు, కొన్నాళ్లు వుండి వెళ్ళిపోతుంది గానీ.. అది తెచ్చే ఆర్థిక లాబాలు అలా ఇలా వుండవు.

కానీ, అవార్డు సినిమాలు చేయాలన్న తపన చాలా కొద్ది మందిలోనే వుంటుంది. ఆ కొద్ది మందిలో తానూ వున్నానంటోంది వేద అలియాస్‌ అర్చన. అచ్చ తెలుగమ్మాయి వేద, ‘కమలతో నా ప్రయాణం’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో కన్పించబోతోంది. సిగరెట్‌ చేతపట్టింది, వేశ్యగా నటించబోతోంది. ఈ సినిమా తన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే ధీమా ఆమెలో కన్పిస్తోంది.

నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్నారు. ఐశ్వర్యారాయ్‌ ఓ సినిమా కోసం సిగరెట్‌ చేతపట్టుకుంటే అది వివాదాస్పమయినా, ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కరీనాకపూర్‌ కూడా సిగరెట్‌ ద్వారా పొందిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.

వేద కూడా అలా సిగరెట్‌ చేతపట్టి పాపులారిటీ పెంచుకుంటుందా, ఆమెకు అవార్డు రావడం ఖాయమేనా? అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
3d cinema halls