Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
blade sundari in saree

ఈ సంచికలో >> సినిమా >>

‘ఆది శంకర’లో ఆ స్థాయి

‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడిసాయి’ చిత్రాల తరహాలో ‘ఆదిశంకర’ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం ఈ నాటిది కాదు. సినిమాలో నాగార్జున ఓ ప్రత్యేకమైన పాత్రలో కన్పిస్తుండడం, సినిమాలో భారీ తారాగణం నటిస్తుండడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఓ సాదా సీదాగా వార్తల్లోకొచ్చి, టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది ‘ఆది శంకర’.

సినిమా విడుదలకు సిద్ధమవగా, ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, టెక్నికల్‌గా హాలీవుడ్‌ స్థాయిలో సినిమా వుందని అన్నారు. ఆయన సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని ఇప్పటికే చూశారట. రాఘవేంద్రరావు సర్టిఫికెట్‌ ఇస్తే, ఆ సినిమాకి అప్పుడే పాస్‌ మార్కులు పడ్డట్టే.

మరో సినీ ప్రముఖుడు దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అయితే, 30 నుంచి 40 కోట్లు పలికే సినిమాలా వుందంటూ ‘ఆది శంకర’ గురించి చెప్పారు. ఇంత కాన్ఫిడెంట్‌గా దాసరి చెప్పడం, సినిమా ఎంత గొప్పగా వుండబోతోందో చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ‘ఆది శంకర’ ప్రముఖులు చెబుతున్న స్థాయిలో వుంటుందా? అంటే వుండే అవకాశాలు ఎక్కువే అని చెప్పవచ్చు.

అంతిమంగా ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు కాబట్టి, సినిమా రిలీజయ్యాక అన్ని విషయాలపైనా స్పష్టత వస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు