Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
3d cinema halls

ఈ సంచికలో >> సినిమా >>

‘ఒకటా’ ‘వన్నా’ ఆ కిందదా

one or okati

మహేష్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. వీడియో టీజర్‌, టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌.. ఇవన్నీ అభిమానులకు ఆనందాన్నిచ్చాయి. కానీ, అంతలోనే కొంత తికమకపడాల్సి వచ్చింది. లెక్కల మాస్టారు సుకుమార్‌ డైరెక్టర్‌ కావడంతో తన క్రియేటివిటీ అంతా ఉపయోగించి ‘1’ అనే నెంబర్‌ని టైటిల్‌గా వేసి, కింద ‘నేనొక్కడినే’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాడు.

అయితే టైటిల్‌ని ఎలా చదవాలో మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. ‘1’ని ‘వన్‌’ అనీ, ‘ఒకటి’ అనీ, ‘ఏక్‌’ అనీ.. ఎవరికి తోచిన రీతిలో వారు సినిమా టైటిల్‌ని పలుకుతున్నారు. సినిమా టైటిల్‌ ‘నేనొక్కడినే’ అనేవారూ వున్నారు. అభిమానులేమో చాలా తికపడాల్సి వస్తోంది తమ అభిమాన హీరో కొత్త సినిమా పేరు చెప్పాలంటేనే.

సుకుమార్‌ తొలి సినిమా ‘ఆర్య’లో హీరోయిన్‌ క్యారెక్టర్‌ చాలా కన్‌ఫ్యూజన్‌లో వుంటుంది. ‘ఆర్య`2’ కూడా అంతే. కానీ, సినిమాలో క్లారిటీ వుంటుంది. అయితే, సుకుమార్‌ ` మహేష్‌ కొత్త సినిమా టైటిల్‌ మాత్రం అభిమానుల్ని కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. ఈ కన్‌ఫ్యూజన్‌ సినిమా రిలీజయ్యాక పోవడం ఖాయమనే ధీమాతో వున్నాడట సుకుమార్‌. అలాగైతే మంచిదే.

ఎంతైనా లెక్కల మాస్టారు కదా, ఆయనకు ఖచ్చితమైన లెక్కలు లేకుండా ఎలా వుంటుంది.

మరిన్ని సినిమా కబుర్లు
blade sundari in saree