Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
one or okati

ఈ సంచికలో >> సినిమా >>

చీరకట్టులో బ్లేడు సుందరి

blade sundari in saree

‘ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ’ సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ నిఖితా నారాయణ్‌, సంప్రదాయ వస్త్ర ధారణలో అయినా, మోడ్రన్‌ దుస్తుల్లోనైనా అదరహో అన్పించేయగలదని తొలి సినిమాతోనే ప్రూవ్‌ చేసుకుంది. 

తాజాగా ఆమెకు దర్శకుడు వంశీ ఓ ఛాన్స్‌ ఇచ్చారు. వంశీ దర్శకత్వంలో ఆమె నటిస్తోన్న ఓ సినిమా షూటింగ్‌ హైద్రాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద జరుగుతోంది. ఈ సందర్భంగా చీర కట్టులో, మెడలో బ్లేడుతో ఇలా అందాల విందు చేసింది నిఖితా నారాయణ్‌. ఇండియన్‌ ట్రెడిషన్‌లో వున్న గొప్పతనమంతా చీర కట్టులోనే వుంటుందన్న విషయం ఈ ఫొటో చూస్తే అర్థమవుతుందెవరికైనా.

వంశీ సినిమా అంటే హీరోయిన్లు అందంగా కన్పిస్తారనే అభిప్రాయమొకటుంది ప్రేక్షకుల్లో. హీరోయిన్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తాయి వంశీ సినిమాలు. అలా నిఖితా నారాయణ్‌ కూడా వంశీ సినిమాతో హీరోయిన్‌గా మంచి కమర్షియల్‌ సక్సెస్‌ అందుకోవాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
aadi shankara in hollywood ragne