Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

గుడ్లు పెట్టిన బంగారు కోడిపెట్ట
చిరంజీవి తరం వారిని, ఈ తరం వారిని ఒక ఊపు ఊపేసిన పాట బంగారు కోడిపెట్ట. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే - చాలా పాటలను తిరిగి వాడుకున్నప్పుడు ఒరిజినల్ పాట ట్యూన్ ఎవరు చేశారో, సాహిత్యం ఎవరు రాశారో లాంటి వివరాలు పొందుపరచరు. కానీ 'ఘరానా మొగుడు' లోని 'బంగారు కోడి పెట్ట' పాటను తిరిగి 'మగధీర' లో వాడుకున్నప్పుడు అప్పట్లో ఆ పాటను రాసిన భువనచంద్ర పేరుని తిరిగి వెయ్యడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా పంపించారట. ప్రతి ఒక్కరూ ప్రశంసించదగ్గ, అనుసరించ దగ్గ సంప్రదాయమిది.

ఇది కాకుండా మరి కొన్ని విశేషాలున్నాయి.

'ఘరానా మొగుడు' లోను, 'మగధీర' లోను వున్నఈపాటకి తండ్రి చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ నటించిన సంగతి అందరికీ తెలిసినదే అలాగే మరో తండ్రి కొడుకుల కాంట్రిబ్యూషన్ కూడా వుందీ పాటకి . వారు సంగీత దర్శకుడు మణిశర్మ, ఆయన కుమారుడు సాగర్. చిరంజీవి పాటకి కీరవాణి సంగీత దర్శకత్వం లో మణిశర్మ కీ బోర్డ్ వాయిస్తే రామ్ చరణ్ పాటకి అదే కీరవాణి మ్యూజిక్ లో మణిశర్మ గారబ్బాయి సాగర్ కీ బోర్డ్ వాయించాడు.

ఇదిలా వుండగా పాట మొదట్లో వచ్చే 'పాపా హ్యాండ్సప్' అనే పదాలకు రెండో వెర్షన్ లో అనుకున్నంత రీతిలో రాకపోవడం తో మొదటి వెర్షన్ లోని బాలూ వాయిస్ నే ఆ ఒక్క ముక్క వరకు తిరిగి ఉపయోగించుకున్నారు.

ఈ పాట క్రెడిట్ ఎవరిది ?
'వెలుగు నీడలు' (1961) సినిమాలోని 'హాయి హాయిగ జాబిల్లి ' పాట సంగీతాభిమానులకు గుర్తుండే వుంటుంది. ఆ పాటను సంగీత దర్శకుడు పెండ్యాల అద్భుత స్వరరచన గా సభల్లోను, టివీ కార్యక్రమాల్లోను పేర్కొంటూ వుంటారు. పెండ్యాల ఎన్నో గొప్ప గొప్ప పాటలను స్వరపరిచారు. కానీ ఈ పాటకు పూర్తి క్రెడిట్ పెండ్యాల గారికి ఇవ్వడం సరి కాదు.


 

ఎందుకంటే పల్లవిని, కొంత ఆర్కెష్ట్రయిజేషన్ ని పెండ్యాల ఒక హిందీ సినీ గీతం నుంచి తీసుకున్నారు గనుక. 1959 లో 'నయా సంసార్' అనే చిత్రం వచ్చింది. చిత్రగుప్త ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆయన స్వరపరిచిన 'చందా లోరియా సునాయే' అనే పాట ఈ 'హాయి హాయిగ జాబిల్లి' పాటకి మూలం, ఇన్ స్పిరేషన్ కూడా.

యూ ట్యూబ్ లో గాని ఇంకేదైనా మ్యూజిక్ సైట్ లో గాని 'chanda loriyan sunaye' పేరుతో వెతికితే ఆడియో మాత్రం వినిపిస్తుంది. అది చాలు మనకి తెలిసిపోవడానికి.

పకడో పకడో

పైన 'నవరాత్రి' సినిమా పేరుతో వున్న ఇన్ లే కవర్ పై వున్న సావిత్రి, నాగేశ్వరరావు ఫొటోలు 'నవరాత్రి' లోనివి కావు. 'మనుషులు - మమతలు'  సినిమా లోనివి. జత పరిచిన ఫోటోలు గమనించండి.
 

మరిన్ని సినిమా కబుర్లు
target award with cigarette in hand