Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

 జరిగిన కథ : సౌమ్య బావ, అతడి దుర్మార్గమైన చేష్టలు డా. హరి చెప్తుంటే విని ఆశ్చర్యపోతుంది మేఘన...

ఆ తర్వాత....

‘‘అదెలా...?’’

‘‘కావాలనే ఈ విషయాలన్నీ తెలియపరచకుండా దాచాలని రవిబాబు వేసిన ప్లాన్అది...

‘‘ఆఫ్ట్రాల్ అటెండర్ గాడు... ఒక పెద్ద డాక్టర్ తో గేమ్ లు ఆడటమేమిటి? వాడెంత? వాడి బ్రతుకెంత? మీరు ఇంత తెలివైనవారై ఉండి వాడి ఆటలు ఎలా సాగనిచ్చారు? మీ ముందు వాడేపాటి అసలు..?’’

‘‘అటెండర్లలో కూడా చాలా మంచి వాళ్లున్నారు. కానీ ఇతని విషయానికొస్తే.... మనుషులతో గేమ్ లాడే వ్యక్తి. ఇతనికి చదువు సంధ్యలు వంటబట్టలేదు గానీ అల్లరి చిల్లరగా తిరిగి తిరిగి మనుషులతో ఎలా మెసలాలి? ఎలా ఎవర్ని బుట్టలో పెట్టాలి? ఎలా తలకాయలు మార్చాలి..! ఏ విధంగా ఎవర్ని కొట్టినట్టు తెలియకుండా కొట్టాలి? వాళ్ల వీక్ పాయింటేమిటి? ఆ వీక్ పాయింట్ ని కాష్ చేసుకోవడమెలా? ఎవర్ని ఎప్పుడు ఎలా పడగొట్టాలి? ఎప్పుడు ఎవర్ని ఎలా పొగడాలి? ఎప్పుడు ఎవర్ని ఎలా నిరుత్సాహ పరచాలి? డౌన్ చేయాలి? మనకు కావలసినది ఎదుటి వాడి నోటి నుండే చెప్పించడం ఎలా? ఎలా నక్క వినయ విధేయతలు ప్రకటించాలి? అవసరం కోసం ఎలా కాచుకూర్చోవాలి? సమయం రాగానే ఎలా కబళించాలి? ఇలాంటి చావు తెలివి తేటల్లో ఆరితేరిన వ్యక్తి రవిబాబు.

రాత్రింబగళ్లు పుస్తకాలు, మెడిసిన్, సూత్రాలు, వైద్య పద్ధతులు, పరీక్షలు, ఇంటర్వ్యూలు వీటితో సంవత్సరాలు గడిపేసే డాక్టర్లు గానీ, ఇంజనీర్లు గానీ అటువంటి వీధి రాజకీయాల్లో నెగ్గలేరు. దారుణంగా... దారుణాతి దారుణంగా ఓడిపోతారు... ఎందుకంటే వాళ్ల రక్తంలోనే ఇటువంటివి లేవు

గనుక... కానీ ఒక్కసారి.... ఒక్కసారి పసిగడితే.... పసిగట్టి, అసలు విషయం కనిపెట్టి తమ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తే... ఇలాంటి గుంటనక్కలు నిలువునా మాడి మసైపోతాయి... పుట్టగతుల్లేకుండా పోతాయి. పసిగట్టనంత వరకే గుటనక్కల ఆటలు.’’ కొద్దిగా గాలి పీల్చుకోవడం కోసం

అన్నట్లుగా ఆగాడు హరి...

‘‘మరి సౌమ్య తండ్రి బతికే ఉన్నట్లు తెలిసాక మీరేం చేసారు?’’

‘‘నేనేం చేయలేదు. ఆమె తండ్రీ, కొడుకు, ఇంకో కూతురూ విషయం తెలసుకుని సౌమ్య దగ్గరకు వచ్చారు. వారిని ఆదరించాలా? వద్దా? అని తటపటాయిస్తున్న సౌమ్యకు నేనే చెప్పి వాళ్లతో సఖ్యతగా ఉండమన్నాను.’’

‘‘మంచిపనే చేసారు...’’

‘‘కానీ ఇది రవిబాబుకు కంటగింపుగా మారింది. అసలు వాళ్లున్నట్లుగానే తెలియకుండానే మేనేజ్చేద్దామనుకున్న అతనికి వాళ్లని సౌమ్య దగ్గరకు చేరదీయడం విపరీతమైన బాధ కలిగించింది. ఆ బాధ కక్షగా మారింది.’’

‘‘అయ్యో... పాపం... అక్క పిల్లలకు బట్టలనీ, ఫీజులనీ, పండగలనీ పబ్బాలనీ ఎంతో చేసిన సౌమ్య మంచితనాన్ని ఎవరైనా ఎలా మరచిపోతారు? ఎలా కక్ష కడతారు?’’

‘‘హూ.... పాముకు పాలుపోసి, ఎన్ని పెట్టినా పెట్టిన చేతినే కరుస్తుంది. సొంత పిల్లలనే మింగివేయ గలుగుతుంది. అంతకంటే హీనమైన మనుషులు చేసిన మేళ్లు మరచి, ఇంకా ఏదో, ఇంకా ఎంతో చేయలేదని కక్ష కడతారు, కుత్తుకలు కోస్తారు.’’

‘‘ఓ మైగాడ్... ఇంకా...?’’

‘‘సౌమ్య తరఫు వాళ్లతో మంచిగా కలిసి మెలసి ఉండే ముందు తనకొక మాట చెప్పి తన పర్మిషన్తీసుకోనందుకు నా మీద కూడా కక్ష పెంచుకున్నాడు రవిబాబు.’’

‘‘అబ్బ... ఎంత దారుణం? ఇంతవరకు వినలేదు. ఇక వినబోను కూడా అన్నట్లుంది.’’

‘‘ఆశ్చర్యమేమీ లేదు... నీచుడెప్పుడూ నీచంగానే ఆలోచిస్తాడు. నీచుడు గొప్పగా ఆలోచిస్తేనే ఆశ్చర్యపోవాలి.’’

‘‘టూ మచ్...’’

‘‘ఇంతలో ఇంకో విషయం తెలిసింది...’’

‘‘ఏమిటది..?’’

‘‘సౌమ్య వాళ్లకు ఐదు ఎకరాల పంట భూమి ఊర్లో ఉందని...’’

‘‘ఉంటే...?’’

‘‘ఆ భూమి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని మంచం మీద ఉన్న అత్తగారిపై రవిబాబు ఒత్తిడి తెచ్చాడనీ, ఒప్పుకొని వేలిముద్రలు వేయనన్నందుకు ఆమె పీక పిసికి చంపేసాడనీ సౌమ్య తండ్రి, తమ్ముడు, అక్కలకు పూర్తి విశ్వాసం.’’

‘‘మరీ నీచ నీకృష్ట ముదనష్టపోడిలా ఉన్నాడు.’’

‘‘ఈలోగా సౌమ్య తండ్రి ఆడపిల్లలకు ఉన్న భూమిలో ఎంతో కొంత రాసి ఇస్తానని అన్నాడు.’’

‘‘ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆడపిల్లలకు ఇంకేమి భూమి? బూడిద తప్ప...’’

‘‘అలాక్కాదు మేఘనా... చట్టం మారింది...’’

‘‘అంటే..?’’

‘‘ఆస్తి తల్లి పేరు మీద ఉండి, తల్లి విల్లు రాయకుండా చనిపోయినట్లయితే ఆ ఆస్తి సమభాగాలుగా విభజించి భర్తకో భాగం, పిల్లలందరికీ ఒక్కో భాగంగా ఇవ్వవచ్చు.’’

‘‘అయితే ఇందులో పెద్ద విశేషమేముంది? ఎవరిది వారికిచ్చేస్తే ప్రాబ్లమ్సాల్వ్అయిపోతుందిగా?’’

‘‘సౌమ్య తండ్రి వెర్షన్ప్రకారం... సౌమ్య తమ్ముడికి సరైన ఉద్యోగం లేదు. ఏదో ఆ ప్రైవేటు ఉద్యోగమనీ ఈ ప్రయివేటు ఉద్యోగమనీ కాలక్షేపం చేస్తున్నాడు. ఏదో ఆ కొద్దిపాటి ఆస్థి ఉండబట్టి దానిమీద  వచ్చే ఆదాయంతో బతుకుతున్నాడు. వాడికి పెళ్లయింది, ఇద్దరు పిల్లలు. ఎవరిది వాళ్లకిచ్చేస్తే వాడి ఆదాయం తగ్గి తిండికి లేక అల్లాడతాడు.’’

‘‘అందుకని...?’’

‘‘ముగ్గురాడ పిల్లలకీ మూడు అర ఎకరాలు ఇచ్చి మిగిలినది తమ్ముడికి వదిలేయమని సౌమ్య తండ్రి వాదన.’’‘‘మొత్తానికే ఎగగొట్టాలని చూసే ఈ రోజుల్లో ఏదో ఒకటి, ఎంతోకొంత తీసుకుని ఫ్యామిలీ మధ్యలో ప్రాబ్లమ్స్సాల్వ్చేసుకుంటే సరిపోతుంది, కోర్టుల గొడవ లేకుండా.’’‘‘బాగా చెప్పావు మేఘనా... నేను సరే అన్నాను, సౌమ్య ఇంకో అక్క కూడా సరేనంది.’’

‘‘మరి..?’’

‘‘రవిబాబుకి మాత్రం ఇంత ఈజీగా ప్రాబ్లమ్సాల్వ్కావడం ఇష్టం లేదు. కోర్టుకి వెళ్లాలి, కొట్లాడాలి, పంచాయితీ పెట్టాలి, అరుచుకోవాలి, ఒకళ్లమీదకొకళ్లు చెప్పులు విసురుకోవాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి చివరికి తెగతెంపులై ఎక్కడి వాళ్లక్కడ విడిపోవాలి. సామరస్యం, శాంతం ఏమాత్రం పడవతనికి... పైగా సమస్యను తేలిగ్గా పరిష్కరించిన గొప్పతనం నాకు రాకూడదని అతని కోరిక. అసలే నామీద, సౌమ్య మీద మండిపడుతున్నాడు. డబ్బులు ఇవ్వడం లేదని, వస్తువులు ఇవ్వడం లేదని, ఈ రాజీ విధానంతో ఇంకా పిచ్చివాడైపోయాడు.’’‘‘మిగిలిన వాళ్లందరూ ఒకటే మాట మీద ఉంటే ఏం చేస్తాడు?’’

‘‘అదే... అక్కడే చావు తెలివితేటలు, వక్ర బుద్దులు, నీచ కుటిల రాజకీయాలు ప్రయోగించబడతాయి. నిజాయితీగా నిలబడలేని దురాశాపరుడు దొంగదారిన దెబ్బకొడతానికి ప్రయత్నిస్తాడు.’’

‘‘ఎలా...?’’

‘‘మేము ఉండే ఇంటి వెనకనే పనిమనిషి ఇల్లు. ఒకరోజు రాత్రి 12 గంటల తరవాత ముగ్గురు రౌడీలను ప్రేరేపించి, సౌమ్య తమ్ముడు, తండ్రి తిట్టినట్లుగా సౌమ్యని దుర్భాషలాడిరచాడు.

అమ్మదుర్మార్గులు, వాళ్లే మీ తమ్ముడు, తండ్రి అని అనుమానం వచ్చేటట్లుగా చేసాడు. ఇలాంటివన్నీ అలవాటు లేని నేను ఫోన్చేసి, సౌమ్య తమ్ముణ్ణి, తండ్రిని ఇంకెప్పుడూ కలవవద్దు. మీ అరెకరం వద్దు మీరూ వద్దు అని చెప్పేసాను.’’

‘‘రవి బాబు గాడి ప్లాన్బాగానే నెగ్గింది, వాడనుకున్నట్లుగానే చేసావు. వాడికి కావల్సఇంది అదే... వాడే నెగ్గాడు.’’




వృత్తి తప్ప మరో వ్యాపకం తెలీని డా. హరి, దుర్మార్గంలో ఆరితేరిన రవిబాబు... ఇద్దరిమధ్యా వైరం..ఎక్కడికి దారితీసింది...???????
వచ్చేవారం

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra