Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tollywood young hero dedication

ఈ సంచికలో >> సినిమా >>

అన్నయ్య సినిమా హిట్‌ అవ్వాలని

get success brother's movie

అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని ఆకాంక్షించాడు తమ్ముడు ఎన్టీఆర్‌. ‘పటాస్‌’ సినిమా ఆడియో విడుదల వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్‌, అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ సినిమా అంటే డెడికేషన్‌ ఉన్న వ్యక్తి అనీ, హీరోగానే కాక, నిర్మాతగానూ మంచి సినిమాలు ఇకపైనా తీయాలని కోరుకుంటున్నానని అన్నాడు.ఎన్టీఆర్‌, రవితేజ, ఇంకా పలువురు సినీ ప్రముఖులు ‘పటాస్‌’ ఆడియో విడుదల వేడుకలో పాల్గొని, సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్‌కి విషెస్‌ అందించారు. ‘పటాస్‌’ ఆడియో చాలా రోజుల క్రితమే జరగాల్సి ఉండగా, కళ్యాణ్‌రామ్‌ సోదరుడు జానకిరామ్‌ కారు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి కళ్యాణ్‌రామ్‌కి టైమ్‌ పట్టింది.అన్నయ్య ఈ వేదికపై లేకపోవడం చాలా బాధగా వుందని కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ అన్నారు. అన్నయ్య ఆశీస్సులు తమ వెంట వుంటాయని వారిద్దరూ చెప్పారు. అనిల్‌ రావిపూడి తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రానికి. కళ్యాణ్‌రామ్‌ సొంత బ్యానర్‌ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. సాయికార్తీక్‌ దర్శకుడు. శృతిసోది హీరోయిన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
surya vs surya with kartikeya flavour