Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
surya vs surya with kartikeya flavour

ఈ సంచికలో >> సినిమా >>

కృష్ణార్జునుల్ని తలపిస్తున్నారు

like krishnarjunas

మోడ్రన్‌ కృష్ణార్జునులుగా పవన్‌కళ్యాణ్‌, వెంకటేష్‌ ‘గోపాల గోపాల’ సినిమా స్టిల్స్‌లో చాలా అందంగా కనిపిస్తున్నారు. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌’ సినిమాని తెలుగులోకి ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీ చిత్రంతో పోల్చితే, తెలుగులో రానున్న ‘గోపాల గోపాల’ అద్భుతమైన రెస్పాన్స్‌ రాబట్టుకునేలా ఉంది.పవన్‌కళ్యాణ్‌ సినిమాకి తెలుగులో ఉండే క్రేజ్‌ అలాంటిలాంటిది కాదు. పవన్‌ ప్లస్‌ వెంకీ అంటే ఆ ఆంచనాలు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం. ఫస్ట్‌ లుక్‌ టీజర్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వస్తున్న స్టిల్స్‌, సినిమాపై అంచనాల్ని పెంచుకుంటూ పోతున్నాయి.రధంపై కృష్ణుడిగా పవన్‌, అర్జునుడిలా వెంకటేష్‌ నిలుచుని ఉన్న ఫొటో ఇప్పటిదాకా వచ్చిన స్టిల్స్‌లో హైలైట్‌గా భావించొచ్చు. న్యూ ఇయర్‌ విషెస్‌తో ఆ స్టిల్‌ వచ్చింది. దాంతోపాటుగా ఓ పాటనీ యూ ట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. పవన్‌కి సినిమాలో బాగా నచ్చిన పాట ఇదేనట. వెంకటేష్‌ మెచ్చిన పాట కూడానట. కృష్ణార్జునుల్ని తలపిస్తూ ‘గోపాల గోపాల’లో పవన్‌, వెంకటేష్‌ చేసిన సినీ మాయ ఏంటో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam