Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

‘టెంపర్‌’ సంచలనాలెలా ఉంటాయి?

how would

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న మూవీ ‘టెంపర్‌’. కొన్ని కారణాలతో సినిమా రిలీజ్‌ ఆలసమయ్యిందిగానీ, అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈ సంక్రాంతికి ‘టెంపర్‌’ థియేటర్లలో సందడి చేసేదే. కాజల్‌ హీరోయిన్‌గా నటించింది ఈ మూవీలో. సంక్రాంతికి విడుదల కాలేకపోయిన ‘టెంపర్‌’ని మంచి టైమ్‌ చూసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు, ఆడియన్స్‌ ఆశించే అన్ని అంశాల్నీ సమతూకంలో వేసి, ‘టెంపర్‌’ని దర్శకుడు పూరి జగన్నాథ్‌ రూపొందించాడట. పూరి సినిమాల్లో హీరోకి భిన్నమైన ఆహార్యం ఉంటుంది. పూరితో ఇదివరకు ఓ సారి వర్క్‌ చేసిన ఎన్టీఆర్‌, ‘టెంపర్‌’ సినిమాకి ఇంకా కంఫర్ట్‌గా ఫీలయి, పూరి హీరో పాత్రలోకి ఒదిగి పోయాడట.పూరి జగన్నాథ్‌కి బాగా ఇష్టమైన హీరోల్లో ఎన్టీఆర్‌ ఖచ్చితంగా ఉంటాడు. ఎన్టీఆర్‌ అంటే పూరికి, పూరి అంటే ఎన్టీఆర్‌కి ప్రత్యేకమైన గౌరవ భావం ఉన్నాయి. అవి సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదరడానికి ఉపకరించాయట. ఇండస్ట్రీ రికార్డ్స్‌ని టార్గెట్‌ చేసేలా ‘టెంపర్‌’తో రానున్న పూరి, ఎన్టీఆర్‌ ఆ రికార్డ్స్‌ని బ్రేక్‌ చేయాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
maha mass celebrations