Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ :  ఫ్లైట్ లోజరిగిన అలజడి కొద్దిసేపట్లోనే సద్దుమణుగుతుంది....ఏర్ పోర్ట్ లో అంతా దిగుతారు.....రోడ్ మీద జర్నీకి అంతా సిద్ధమవుతారు....                                         ఆతర్వాత......

ముందు వరుసలో జీవన్, మ్యూజిక్ డైరెక్టర్ యోగి కూర్చున్నారు. వాళ్లకవతల ఆ సిన్మా డైరెక్టర్ వేగేష్, కెమెరామెన్ వినాయకన్ కూర్చున్నారు. తక్కిన వాళ్ళంతా ఎవళ్ళిష్టానికి వాళ్ళు సర్దుకున్నారు. వెనక మట్టుకు హరిప్రియ, అనిల్ సర్దేసుకున్నారు.చివరి సీట్లో కూర్చున్న షహనాజ్ చంటి బిట్టని పెట్టుకున్నట్టు వయోలిన్ బాక్స్ ని ఒళ్ళో పెట్టుకుంది.

హైటెక్ బస్సు మ్యూనిక్ నగరం దాటి బయటికొస్తుంటే సాల్స్ బర్గ్ 177 కిలోమీటర్లు అన్న బోర్డు చూసి ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు జీవన్. మోజార్ట్.... ఓల్ఫ్ గాంగ్ ఎమాడియస్ మొజార్ట్. కటిక దరిద్రంతో ముప్పై ఆరో ఏటే చనిపోయిన మొజార్ట్. ఆయన పుట్టిన ఊరు సాల్స్ బర్గ్. మొజార్ట్ గురించి నా కంటే గొప్పగా వయోలిన్ వాయించే షహనాజ్ కి తెల్సుండాలే అనుకుంటూ వెనక్కి చూశాడు జీవన్.ఆమె కూడా సాల్స్ బర్గ్ బోర్డుకేసే చూస్తుంది.

మళ్ళీ జీవన్ కల మొదలైంది. వెనక్ సీట్లో కూర్చున్న షహనాజ్ వయోలిన్ తీసుకుని సరాసరి జీవన్ దగ్గరికొచ్చి ఉదయ రవిచంద్రిక రాగం వాయిస్తూ రకరకాలుగా విహారాలు చేస్తుంది. ఆ రాగం వింటూ ఆమెనే చూస్తున్నాడు జీవన్.

సిక్స్ వే రోడ్ మీద ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు పెట్టిన నిబంధన ప్రకారం గంటకి నూట ఇరవై మైళ్ళ స్పీడులో హైటెక్ బస్సు వెళ్తుంటే రోడ్డు పక్కనే ట్రైన్ ట్రాక్, దాని పక్కనే నీలంగా ఉన్న నీళ్ళ ప్రవాహంతో కాలవ. కాస్సేపటికి గాలి కంటే స్పీడుగా దూసుకుంటూ, వీళ్ల బస్సుని ఓవర్ టేక్ చేసుకుని వీళ్ళ పక్కనించెళ్ళిపోయింది ట్రైను.

వాళ్ళు వెళ్తున్న రోడ్డుకు పైన అడ్డంగా పెద్ద పెద్ద బ్రిడ్జీలు ప్రతీ అయిదు కిలోమీటర్లకి ఒకటయినా తగుల్తున్నాయి.

ఎడాపెడా పచ్చటి పంటలు, ఎడం పక్కన ఎత్తయిన పెద్ద గుట్ట మీద మూడు విండ్ మిల్స్ పక్క పక్కనే తిరుగుతూ కనిపించాయి. అక్కడక్కడా కనిపించే పాతకాలం నాటి ఇళ్ళు “A” అనే అక్షరం సాగదీసినట్టున్నాయి. వాటిపైన పొగ గొట్టాలు, గోడలకి పాకించిన పచ్చటి తీగలు పూర్వ వైభవం ఏ మాత్రం పాడవకుండా మెయింటేన్ చేసుకుంటా వస్తున్నారక్కడి ప్రజలు.తమాషాగా ఉన్నది ఏది కనిపించినా వెంటనే వెనక్కి తిరిగి చూస్తున్నాడు జీవన్. నల్లటి బురఖా వెనక షహనాజ్ కళ్ళు కూడా వాటిని చూస్తున్నట్టుగానే ఉన్నాయి.

ముంచెన్ సిటీ వచ్చింది.

పొడుగాటి టన్నల్లోంచి దారి. పగలే వెన్నెల్లా సోడియం దీపాల్తో నిండిపోయిందా దారి. ఈ టన్నెలేముందీ ఆస్ట్రియాలో ఆకేన్సీ లేక్ వేపెళ్తే పద్నాలుగు కిలోమీటర్ల పొడుగున్న టన్నెల్ ఉంది. అలా హైటెక్ బస్సు టన్నెల్స్ లో కెళ్ళినప్పుడు వెనకనించి ముద్దులు పెడ్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. దాదాపు కిలోమీటరు తర్వాత వెనక్కి తిరిగి చూస్తే హరిప్రియ, అనిల్. యూనిట్ లో వాళ్ళిద్దరి గురించి బాగా వినిపిస్తున్నాయి. దారిలో మూడు టన్నెల్స్ తగిలాయి. హైటెక్ బస్సు చీకట్లో కెళ్ళిన ప్రతీసారి ఈ ముద్దుల శబ్దాలు ఎక్కువయ్యాయి. పోను పోనూ మూలుగుల దాకా వెళ్ళింది వ్యవహారం.

ముంచెన్ సిటీ చాలా అందంగా ఉంది. పది ఫోర్ల మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ గుండ్రటి భవనంలా కనిపించింది. ఆ పది ఫోర్లూ కార్లతో నిండిపోయి ఉన్నాయి. భవనం చుట్టూ ఎటు తిరిగి చూసినా మెర్సిడెస్ బెంజ్ కార్లే కనిపిస్తాయి. ఆ తర్వాత పాత భవనాల్ని ఎంతో పదిలంగా దాచుకునే వాళ్ళు కట్టుకునే మోడ్రన్ భవనాలు చాలా వింతగా ఉన్నాయి. ముఖ్యంగా వాటి కలర్ కాంబినేషన్ ఇండియాలో మనమెక్కడా చూడం అలాంటి రంగుల కలయిక.

బస్సు గ్యాస్ స్టేషన్ దగ్గరాగింది. బంక్ నానుకునే చిన్న సూపర్ బజారుంది. అంతా అందులోకీ, దాని పక్కనే మెక్ డొనాల్డ్ బర్గర్ షాపులోకీ దూరారు. జీవన్ కూడా రెండు బర్గర్లు కొన్నాడు. ఎక్కడ బడితే అక్కడ మనం యూరిన్ రిలీజ్ చెయ్యగూడదు. కాబట్టి గ్యాస్ స్టేషన్ దగ్గరున్నలెట్రిన్ లోపలికెళ్ళాలంటే ఒక యూరో కాయిన్ వేస్తే తప్ప డోర్లు తెరుచుకోవు. లోపలికెళ్ళిన జీవన్ కి రకరకాల కండోమ్స్ కనిపించాయి. యూరప్ లో సెక్స్ ఎక్కడన్నా చెయ్యొచ్చుగాబట్టి ఈ లెట్రిన్స్ లో కండోమ్స్ కొనుక్కుని లెట్రిన్ డోర్స్ లోకి దూరిపోవచ్చు. లెట్రిన్ లోకెళ్ళాడు జీవన్. పక్క దాంట్లోంచి ఒక అమ్మాయి అబ్బాయి ల మూలుగులూ కేకలూ వినిపిస్తున్నాయి. జీవన్ బయటికొచ్చే సరికి ఆ జంట కూడా బయటికొచ్చి సిగరెట్లు కాల్చుకుంటూ వెళ్ళి కార్లో వెళ్ళిపోయారు.

బస్సు లోపలికొచ్చే సరికి ఇంకా ఎవరూ ఎక్కలేదు.వెనక సీట్లో ఉన్న షహనాజ్ పుస్తకం చదువుకుంటుంది. జీవన్ దగ్గరున్న చికెన్ బర్గర్ ఆమెకిస్తే సైలెంట్ గా తీసుకుని “థాంక్స్” అంది. చాలా గొప్ప వాయిస్. మధుమతి సినిమాలో వైజయంతి మాల గొంతు, పాకీజా సినిమాలో మీనా కుమారి గొంతూ, నిర్దోషి సినిమాలో సావిత్రి గొంతు కలగలిసి వినిపించాయి.

షహనాజ్ తో పాటు ఊహల్లోకెళ్ళిపోతున్నాడు జీవన్. గొంతే అంత బాగుంది కదా, మరి రూపం ఎంత బాగుంటుందో అని ఊహిస్తున్నాడు. ఆపిల్స్ విరగ్గాసిన చెట్టు.

ఒక కొమ్మ మీద కూర్చున్న షహనాజ్ భీం ప్లాసీ రాగం వాయిస్తుంది. ఆమెనంటుకుపోయి కూర్చున్న తను వింటున్నాడు.అసలే పెద్దదైన ఆ రాగంతో ఎంతసేపు ఎంత చాకిరీ చేయించుకుందో షహనాజ్.అసలే తియ్యనైన ఆ రాగం షహనాజ్ చేతిలో మరింత తియ్యనిదైపోవడంతో తను ఆరగించడం మొదలెట్టాడు దాన్ని.

కదిలిన బస్సు కాస్సేపటికి జర్మనీ నించి ఆస్ట్రియా దేశంలోకి అడుగు పెట్టింది.దూరంగా చిన్న గ్రామం ఒకటి కనిపించింది. ఎలిఫెంట్ గ్రే కలర్ వేసున్న ఇళ్ళ పెంకుల మీద పచ్చగా నాచు పట్టేసి ఉంది. గోడలకి తెలుపు రంగు వేసుంది. అందమైన ఆ ఊరి మధ్యలో పాత కాలం నాటి చర్చి. ఊరి వెనక పచ్చటి కొండల మీంచి ఒకటి ఏకాంతంగా కనిపించింది. జనం ఎక్కడా కనిపించడం లేదు. రోడ్డుకి మరో పక్క చూస్తే వేల ఎకరాల మైదానంలో గడ్డి మేస్తున్న బలమైన బ్రౌన్ కలర్ గుర్రాలు, దూరం దూరంగా వర్షాకాలంలో ఎండిన గడ్డి దాచుకునే షెడ్లు కనిపించాయి.ముఖం ముందు వేలాడ్తున్న పరదా లోపలి అందమైన నోట్లోకి బర్గర్ పంపిస్తూ కిటికీ అద్దంలోంచి ఆస్ట్రియా అందాల్ని చుస్తుంది షహనాజ్.

బస్సు ఘాట్ రోడ్ ఎక్కింది. ఎత్తయిన ఆ ప్రదేశం కింద అగాధంలో జిర్ల్ అనే గ్రామం కనిపించింది. అది దాటాక మళ్ళీ టన్నెల్ వచ్చింది. వెనక మొదలైన ముద్దులూ మూలుగులూ బస్సులో అందరికీ వినిపించేంత ఎక్కువగా సౌండ్ లో వినిపిస్తున్నాయి.

వెలుగొచ్చాక చూస్తే... యోగి, బస్సు డ్రైవర్ హాన్సీ దగ్గరున్న మైక్ తీసుకుని వెనక సీట్లోంచి వాళ్ళ మధ్యలో పెట్టాడు. వెలుగొచ్చాక షహనాజ్ తో సైతం బస్సులో అంతా చప్పట్లు కొట్టే సరికి, సిగ్గు పడుతూ తలొంచేసుకుంది హరిప్రియ. అనిల్ అయితే చిరాగ్గా చూశాదు యోగి వంక.పెద్ద లోయలోకి దిగే సరికి వెడల్పాటి రెండు దార్లు కనిపించాయి. బస్సు ని ఎడం పక్క దారిలోకి తిప్పి ఒక కొండెక్కించి దింపితే... ఏగ్జమ్స్ అనే చిన్న గ్రామం వచ్చింది. దాని మధ్యలో ఉన్న న్యూవిర్ట్ అనే హోటలు ముందాగగానే “మరి దిగండి” అన్నాడు జార్జి ప్రసాద్.

ఆ చిన్న గ్రామంలో అదో చిన్న హోటలు. కానీ, స్టార్ హోటల్ రేంజ్ లో ఉంది వాతావరణం. రిసెప్షన్ దగ్గర కెళ్ళిన జార్జి ప్రసాద్ రిజిస్టర్లో పేర్లు రాయించి తాళాలు తీసుకునే పన్లో ఉండగా ఇద్దరు అందమైన అమ్మాయిలు సిగరెట్లు కాలుస్తూ మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు లెస్బియన్స్. జిల్లర్ తల్బాన్ నుంచి ఎంజాయ్ చెయ్యడానికి ఈ ఊరొచ్చారట.

మాతో పాటూ జార్జి ప్రసాద్ ఇచ్చే తాళాల కోసం సైలెంట్ గా వెయిట్ చేస్తున్న కో – డైరెక్టర్ గంగరాజు హఠాత్తుగా లేచి ఒక్కొక్కళ్ళనీ అడుక్కుంటుంటే... తన దగ్గరున్న కట్ డ్రాయర్లలో ఒకటిచ్చాడు చందర్రావు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti