Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yuva

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

శ్రీ గురుభ్యోనమః 

గ్రహాలు - జ్యోతిషం :-

గ్రహాలు వాటియొక్క కక్ష్య వాటికి జ్యోతిషంలో గల వివరణ గురుంచి గత కొన్ని వారాలుగా తెలుసుకుంట్టున్నం. ఈ వారం మరొక గ్రాహం గురుంచి తెలుసుకుందాం. గ్రహాలు వాటియొక్క నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమిస్తూ మానవులపైన వాటియొక్క ప్రభావాన్ని చూపిస్తున్నవి అని మాన ఋషుల భావన. దానికి అనుగుణంగా పరిశోధనలు జరగడం అవి నేడు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలకు మార్గదర్శనం కావడం అలాగే మన ఋషులు చెప్పిన వాటిని బలపరచడం వలన జ్యోతిషం యొక్క ప్రాధాన్యం రోజు రోజుకి పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. వేదంలో చెప్పినవిధంగా కుజగ్రహం ఎరుపువర్ణం కలవాడు ,వార్తులాకారంలో ప్రయాణం చేసేవాడు అని అర్థం. నేడు మన ఆధునిక పరిశోధనలు కుజుడు ఎరుపువర్ణం అని చెప్పడం యాదృచ్చికం కాదు మాన ఋషుల పరిశోధనల సారం అనేది నా భావన. 

గురుగ్రహం :-

సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో పెద్దదైన గ్రహం గురుడు. గురుడు అనగా పెద్దవాడు అని అర్థం. భుమివ్యాసం కన్నా 11 రెట్లు ఎక్కువ. గురుగ్రహం గుండ్రని గోళాకారంగా లేదు ఎందుకనగా దృవం నుండి ధృవానికి కొలిస్తే వ్యాసం 85,160 మైళ్ళు మాత్రమే. గురుగ్రహం యొక్క మధ్యరేఖ వద్ద వ్యాసం 88,600 మైళ్ళు. ఈ గ్రాహం వేగంగా తనచుట్టూ తానూ తిరుగుతుంది. కేవలం రోజుకు 9 గంటల 55 నిమిషాల కొకసారి తిరుగుతుంది. ఇంత వేగంగా తిరిగే గ్రహం మరొకటి లేదు. మనకాలమాన ప్రకారం సూర్యుని చుట్టూ ఒక సారి తిరగడానికి పట్టేకాలం 11. సంవత్సరాలు. శుక్రగ్రహం తర్వాత అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. గురుగ్రహానికి మొత్తం 67 ఉపగ్రహాలు కలవు అందులో 16 ఉపగ్రహాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చును. గురుగ్రహం హీలియం,హైడ్రోజెన్ లోహాలతో పొరలను ఏర్పరుచుకున్నది అన్నది శాస్త్రవేత్తలు  భావిస్తున్నారు

జ్యోతిషంలో గురుడు :-

మన సనాతన సంప్రదాయంలో గురువులకు అత్యంత ప్రముక్యతను  జరిగింది. అంతే కాకుండా మన భరతఖండ చరిత్ర చూసుకుంటే మహామాయ గురువు చాణక్య (విష్ణుగుప్తుడు) అర్దశాస్త్రాన్ని వ్రాసి ప్రపంచానికే తలమానీకం అయ్యాడు అంతే కాకా గ్రీకుల దండయాత్రతో విచ్చిన్నం అయిన ఎన్నో రాజ్యాలను చంద్రగుప్తిన్ని నాయకునిగా మలిచి మౌర్యసామ్రాజ్యస్థాపన చేసి దేశం యొక్క విశిస్థత తెలిపారు. గురుగ్రహాన్ని దేవతల గురువుగా అభివర్ణించారు మన ఋషులు. గురుడు అంగీరసుని కుమారుడు. గురుగ్రహం బంగారువర్ణం అలాగే పసుపు వర్ణాలను సూచిస్తాడు. జ్యోతిషంలో ద్వాదశారాశులలో ధనస్సు,మీనరాశులకు అధిపతి. కటకంలో ఉచ్చ స్థితిని మకరంలో నీచ స్థితిని పొందుతాడు. 
                                                                             గురుగ్రహం జీర్ణక్రియవ్యవస్థపైన,శరీరంలోని కొవ్వులు అలాగే నాలుక,రుఛి అలాగే కాలయం అవయవలపైన ఆధిపత్యం వహిస్తున్నాడు. సంతానం,విద్య,పాండిత్యం ,ధర్మం ,వివేకం,సన్మానం ,సుఖవంతమైన వైవాహిక జీవితం మొదలైనవి గురుగ్రహం యొక్క శుభద్రుష్టి లేదా శుభస్థానాల్లో ఉండటం వలన కలుగుతాయి. చాలావరకు పుస్తకరచయితల జాతకాలను గమనిస్తే గురుగ్రహం యొక్క శుభద్రుష్టి లేదా శుభస్థానాల్లో ఉండటం ఉంటుంది.             

....

మరిన్ని శీర్షికలు
bruhaspati temple