Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'శ్రీమంతుడు'దీ అదే దారి

same way srimantudu movie

భారీగా ఖర్చు చేసి తీసిన 'బాహుబలి' సినిమా కోసం న్యూ ట్రెండ్‌లో పబ్లిసిటీ చేశారు. ఆ పబ్లిసిటీనే సినిమాకి తొలి రోజు భారీ వసూళ్ళను తీసుకొచ్చింది. సినిమాలో కంటెంట్‌ ఉందని దర్శకుడు బలంగా నమ్మినప్పుడు దాన్ని క్యాష్‌ చేసుకోడానికి పబ్లిసిటీ ఎంతో ముఖ్యం. అన్ని సార్లూ ఇది సాధ్యం కాకపోవచ్చుగానీ, ఎక్కువసార్లు సాధ్యమవుతుంది. 'బాహుబలి' తొలిరోజు అద్భుతమైన వసూళ్ళను సాధించగలిగిందంటే అది పబ్లిసిటీతోనే సాధ్యపడింది. ఇదే స్ట్రాటజీ మహేష్‌ సినిమా 'శ్రీమంతుడు'కి కూడా అవలంభిస్తున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న 'శ్రీమంతుడు' చిత్రానికి మహేష్‌బాబు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే కదా. ఆడియో విడుదల తర్వాతి నుంచీ సినిమా ప్రమోషన్‌ని ఎగ్రెసివ్‌గా చేయాలనుకుంటున్నారు. ఎంతో పకడ్బందీగా పబ్లిసిటీ చేసి, అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేస్తారట. ఓవర్సీస్‌లో మహేష్‌కి మంచి మార్కెట్‌ ఉండటంతో, అక్కడి ఆడియన్స్‌ని ఫస్ట్‌ డే థియేటర్లకు రప్పించడానికి వీలుగా ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ వ్యూహమూ వర్కవుట్‌ అయి, భారీ విజయాన్ని 'శ్రీమంతుడు' సొంతం చేసుకుంటూ తెలుగు సినీ రంగానికి బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు పెద్ద హిట్స్‌ వచ్చినట్లవుతుంది.
 

మరిన్ని సినిమా కబుర్లు
naresh with mohanbabu