Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

జరిగిన కథ: ఆ దెయ్యం కోసం హాఫెనవర్‌ శ్లాట్‌ అడ్వాన్స్‌గా ఉంచమంటాడు తేజా.   ఇప్పుడు తేజా  కళ్లముందు రెండు టాస్క్‌లు. ఒకటి` ప్రతిమ డెత్‌ సీక్రెట్‌ పరిశోధించడంతో  పాటు ప్రతిమలా కనిపిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఆరా తీయాలి. ఆ తరువాత... 

ఆమె ఎవరో కాదు `ప్ర....తి....మ.

సెల్‌ చెవిలో పెట్టుకుని ఆమె ఎవరితోనో మాట్లాడుతోంది. కళ్లకు నల్ల కళ్లద్దాలు. చుడీదార్‌ వేసుకుని ఉంది.

‘‘ప్ర...తి...మా!’’ గట్టిగా అరిచాడు తేజ. అంత గట్టిగా అతడు

ఆమె ఎవరో కాదు `ప్ర....తి....మ.

సెల్‌ చెవిలో పెట్టుకుని ఆమె ఎవరితోనో మాట్లాడుతోంది. కళ్లకు నల్ల కళ్లద్దాలు. చుడీదార్‌ వేసుకుని ఉంది.

‘‘ప్ర...తి...మా!’’ గట్టిగా అరిచాడు తేజ. అంత గట్టిగా అతడు అరిచినా ట్రాఫిక్‌ రణగొణధ్వనిలో ఆ అరుపు వినిపించలేదు కాబోలు ఆమెలో ఏ చిన్ని కదలిక కూడా కనిపించలేదు. పైగా, సెల్‌ఫోన్‌ సంభాషణను కొనసాగిస్తూనే ఉంది.

‘‘ప్లీజ్‌! ప్రతిమా... ఇటు చూడండోసారి. నేను... తేజాని’’ అరుస్తున్నాడతడు పిచ్చిపట్టిన వాడిలా. ఆ వెన్వెంటనే బైక్‌ స్డాండ్‌ వేసి ఆ కారు దగ్గరికి వెళ్లి విండోలోకి తొంగిచూస్తూ` ‘‘మీరు ప్రతిమ కదూ’’ అని గట్టిగా అడిగాడు.

ఊహించని రీతిలో ఓ వ్యక్తి కార్లోకి వంగి మరీ తన గురించి ఆరా తీస్తుంటే ఆమె మొదట గాభరా పడిరది.  అంతలోనే తేరుకుని చెవిలో ఉన్న సెల్‌ఫోన్‌ని కాస్త పక్కకు తీసి అతడి వంక చూస్తూ అడిగింది` ‘‘హూ ఆర్‌ యూ?’’

‘‘నేనడుగుతోంది అదే.  మీరు ప్రతిమ కదూ’’

‘‘మీరనుకుంటున్న ప్రతిమను నేను కాదు’’

‘‘మరి...?’’

‘‘ఐయామ్‌ జెస్సికా ఫ్రం యూ ఎస్‌ ఎ. మీ క్వశ్చన్‌కి ఆన్సర్‌ దొరికిందనుకుంటాను. ప్లీజ్‌!’’ అంటూ కాలు యాక్సిలేటర్‌ మీద బలంగా నొక్కింది. అంతలోనే గ్రీన్‌లైట్‌ వెలగడం... వెనుక నుంచి హరన్ల శబ్ధం అధికమవడం... ఆగి ఉన్న ఇండికా కారు ఒక్కసారి స్టార్టయి వేగం పుంజుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి.

తేజా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కారుని అనుసరించ సాగాడు. ముందు ఆమె కారు. వెనుక బైక్‌ మీద తేజా.  హైదరాబాద్‌ రోడ్లపై పగలే జరుగుతున్న చేజింగ్‌ అది. ముందున్న వాహనాల్ని నేర్పుగా,  ఓర్పుగా దాటుకుంటూ జెస్సికా కారును అనుసరించడమే ఏకైక ధ్యేయంగా తేజా బైక్‌ని ముందుకురికిస్తున్నాడు.

ఖైరతాబాద్‌, లక్‌డీకాపూల్‌ మీదుగా ఆ కారు ముందుకు దూసుకుపోతోంది. సిటీలో పాటించాల్సిన స్పీడ్‌ లిమిట్స్‌ని దాటి మరీ ముందుకు దూకుతున్న ఆ కారును తన బైక్‌తో వెంటాడుతూనే ఉన్నాడు తేజ.

‘‘అచ్చం ప్రతిమలా కనిపిస్తున్నఆమె జెస్సికా?’’ నమ్మలేకపోతున్నాడు తేజ. బహుశా, ఈ అమ్మాయిని చూసే ప్రతిమ అనుకుంటున్నారంతా. ఆనందరావు, యాంకర్‌ వరలక్ష్మి, తన చెల్లెలు... ఇప్పుడు తాజాగా తనకూ ఈమె కనిపించింది.  చూసిన మొదటి క్షణంలోనే తనూ ఆమెని ప్రతిమగానే భ్రమపడ్డాడు. ప్రతిమ చావును చానెల్‌లో రిపోర్డ్‌ చేసిన తానే ఆమెని ప్రతిమగా అనుకున్నప్పుడు మిగిలిన వాళ్లు అనుకోవడంలో ఏ మాత్రం పొరపాటు లేదనిపించింది తేజాకి.

ఆమె కారు రవీంద్రభారతి సిగ్నల్స్‌ని దాటేసింది. ఐదడుగుల వెనక ఉన్న బైక్‌ ఆ సిగ్నల్‌ దాటబోతుండగా రెడ్‌లైట్‌ వెలిగింది.

అంతే! ముందుకు దూకాల్సిన బైక్‌ ముందు చక్రం ఆ సిగ్నల్‌ దగ్గరే సడన్‌ బ్రేక్‌తో ఆగిపోయింది.

‘‘షట్‌...’’ అనుకున్నాడు తేజా.  ఆ వెంటనే అతడి బుర్ర పాదరసంలా పని చేసింది. కళ్ల కెమెరాని క్లిక్‌ చేసి ఆమె కారు నంబర్‌ను మెదడులో ముద్రించుకున్నాడతడు.

‘‘ఇంతకూ తను సాధించినదేంటీ?’’ ప్రశ్నించుకున్నాడు తేజ.

‘‘అంతకుముందు ఆ అమ్మాయిని చూసిన వాళ్లు సునిశితంగా గమనించి గుర్తుపట్టుకులేని కారు నంబర్‌ను తను మాత్రం గుర్తుపట్టుకున్నాడు. అదొక్కటే ఈ కేసులో తను సాధించిన విజయంగా చెప్పుకోవాలి. ఆమె ప్రయాణిస్తున్న కారు నంబర్‌ ఆధారంగా ఆమె జాడ తెలుసుకోవాలి. ఇంత పెద్ద సిటీలో ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఆమె తరచూ కనిపిస్తోందని సమాచారం అందుతున్న పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌, కోటీ హరిద్వార్‌ ప్రాంతాల్లో నిఘా వేయాలి. యాంకర్‌ వరలక్ష్మి జెస్సికాని స్టూడియోకి రప్పించి ఇంటర్వ్యూ చేయాలనే ఇంట్రస్ట్‌ చూపిస్తోంది కాబట్టి... ఈ విషయంలో ఆమె సేవలూ ఉపయోగించుకోవచ్చు. అలాగే, తన చెల్లి కోటీ విమెన్స్‌ కాలేజీలో చదువుతోంది... ఆ ప్రాంతంలోనే జెస్సికాను ఓ సారి చూసింది కాబట్టి తను కనిపించిన వెంటనే ఫోన్‌చేయమని సూచిచొచ్చు. అచ్చం ప్రతిమను పోలినట్లున్న ఈ ‘జెస్సికా’ నేపధ్యాన్ని తెలుసుకుంటే ప్రతిమ కేసుకేమైనా ప్రయోజనం ఉంటుందేమో? అచ్చం ప్రతిమ లాగానే కనిపిస్తున్నఈమె ప్రతిమకేమవుతుంది?

కళ్లెదురుగా జరుగుతున్న ఇన్సిడెంట్లను పేర్చుకుంటూ వెళ్తే ఓ థ్రిల్లర్‌ సినిమాను చూస్తున్న అనుభూతి కలుగుతోంది తనకు. క్రియేటివ్‌ పర్సన్‌గా ప్రతిమతో పరిచయం, ప్రతిమ తండ్రిగా ఫణిభూషణరావు గురించి ఎంతో కొంత తెలిసిన వైనం, అర్ధాంతరంగా చనిపోయిన ప్రతిమ ఉదంతం, ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసును అంతలోనే అటకెక్కించడం, చానెల్‌కి కొత్త క్రయింస్టోరీ కోసం మళ్లీ ప్రతిమ కేసును తను పరిశోధించడం’’ ప్రతిమకు సంబంధించిన అన్ని విషయాలను గుర్తుచేసుకుంటున్నాడు తేజ. ఫణిభూషణరావు జెస్సికా కోసం ఎందుకు వెతుకుతున్నాడు? ప్రతిమ చనిపోయిన సంగతి కన్న తండ్రిగా అతడికి తెలిసినప్పుడు... ఈ ‘జెస్సికా’ ఎవరో కూడా ఆయనకే తెలిసుండాలి. జెస్సికా గురించి తెలిసినా... ఈ సిటీలో ఆమె ఆచూకీ ఎక్కడో ఆయనకు తెలిసుండదు.  అందుకే కాబోలు, సీక్రెట్‌గా డిటెక్టివ్‌ని ఆశ్రయించాడు. తనకు కావల్సిన జెస్సికాను వెతికి పట్టుకోవడమనే అంశాన్ని ఆయన గుట్టుగా ఉంచడం ఎందుకు? అంటే ... తను తను వెతుకుతున్న సంగతి ఆమెకు తెలీయకూడదనుకుంటున్నాడా? ఆమెకు తెలీకుండా ఆమె గురించి ఆరా తీయడంలో రహస్యం ఉందంటే... ‘జెస్సికా’,  ఫణిభూషణరావుల మధ్య కూడా లోకానికి తెలీని ఏదో రహస్యం ఉండే ఉంటుంది.  ఆ రహస్యం బట్టబయలైతే జెస్సికా, ప్రతిమల మిస్టరీ విడిపోతుంది. అనుకున్నాడు తేజ.


‘కొత్త కాన్సెప్ట్‌తో క్రయింస్టోరీ మొదలెట్టాలనుకుంటే... మరెన్నో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. సిద్దార్థను వెంటనే కలవాలి.  జెస్సికా విషయంలో అతడి పరిశోధన ఎంత వరకూ వచ్చిందో తెలుసుకోవాలి’’ అనుకోవడమే తరువాయి సిద్దార్థకు ఫోన్‌ చేసాడు తేజ. ఆఫీసులోనే ఉన్నాడని తెలుసుకుని అతడ్ని కలుసుకోవడానికి హుటాహుటిన బయల్దేరాడతడు.

‘‘చాలా రోజుల తర్వాత... ఊరకరారు క్రయిం రిపోర్టర్లు ’’తనదైన శైలిలో నవ్వుతూ పలకరించాడు సిద్దార్థ. అలవాటుగా కూల్‌డ్రిరక్‌ ఆఫర్‌ చేస్తూ అడిగాడు`‘‘ఏంటీ విశేషాలు? మళ్లీ ప్రతిమకు సంబంధించేనా?’’ తేజా వచ్చినప్పుడల్లా అలా అడగడం సిద్దార్థకు ఆనవాయితీ అయిపోయింది. తేజ ప్రతిమను మరిచిపోలేకున్నాడని అతడు భావిస్తున్నాడు.

‘‘కాదు...’’

‘‘మరి...’’

‘‘జెస్సికా గురించి తెలుసుకుందామని’’ ఉలిక్కిపడ్డాడు సిద్దార్థ.

‘‘జెస్సికా... ఆమె నీకెలా తెలుసు?’’

‘‘ఆమె కాదు... పేరు మాత్రమే తెలుసు’’ అన్నాడు తేజ.

‘‘ఔను.. అదే! ఆ పేరైనా నీకెలా తెలుసు’’ అడిగాడు సిద్దార్థ కుతూహలంగా.

‘‘నాకెలా తెలిసిందని నువ్వడుగుతున్నావంటే... నీకూ జెస్సికా గురించి తెలిసిందన్న మాటేగా’’ అడిగాడు తేజ.  ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు మళ్లీ` ‘‘ఇందులో రహస్యమేం లేదు. మా చానెల్‌ కోసం నేనూ ప్రతిమ గురించి మరింతగా తెలుసుకుంటున్నాను. నువ్వూ ఫణిభూషణరావు కోసం జెస్సికా గురించి ఆరాతీస్తున్నావు. మన పరిశోదనలు వేర్వేరుగా సాగుతున్నా ఇద్దరం ‘జెస్సికా’ దగ్గర కొచ్చే ఆగాం...’’ నవ్వాడు.

‘‘చెప్పు సిద్దార్థా! జెస్సికా గురించి మీరేం తెలుసుకున్నారు’’

‘‘ముందు నువ్వు చెప్పు. ఎందుకంటే... క్లయింట్స్‌కి సంబంధించిన ఇన్విస్టిగేషన్‌ వివరాలు సీక్రెట్‌గా ఉంచాలి కదా! నువ్వు చేసే పరిశోధన మాత్రం ఇందుకు భిన్నం. నీకు తెలిసిన సమాచారాన్ని ఏక్రయింబులెటెన్‌ ద్వారానో ప్రజలకు చేరవేస్తావు. అంటే, తెలుసుకున్న విషయాలు, వివరాలు పబ్లిక్‌ చేసే దిశగానే నీ పరిశోధన ఉంటుంది. అందుకు నువ్వే జెస్సికా గురించి తెలుసుకున్నదేదో చెప్పాలి’’

వెంటనే తేజా కుర్చీలోంచి లేస్తూ తన చేతిని ఫ్యాంట్‌ వెనుక జేబు లోకి పోనిచ్చాడు. తర్వాత పర్సులోంచి చిన్నకాగితాన్ని సిద్దార్థకిచ్చాడు.

‘‘ఏంటీ...’’

‘‘కారు నంబర్‌.  జెస్సికా ఈ నంబర్‌ గల కారులోనే సిటీలో ప్రయాణిస్తోంది’’

సిద్దార్థ పడి పడి నవ్వాడు. ఆ తర్వాత` ‘‘కొండను తవ్వి ఎలకను పట్టుకోవడం అంటే ఇదే. జెస్సికా కారు నంబర్‌ దొరకపుచ్చుకుని ఆమె దొరికిపోయిందన్నంత బిల్డప్‌ ఇచ్చావు’’

‘‘కారు నంబర్‌తో ఆమెని ట్రేస్‌ చేయలేమా? ఒక్క సంగతి చెప్పనా? ఆ రోజు ఆనందరావు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు జెస్సికా గురించి మనిద్దరికీ ఏం తెలీదు. ప్రతిమ పోలికల్లో ఉంది కాబట్టి ప్రతిమ ఫొటో చూపించి పేరు కూడా తెలీని ఈ వ్యక్తిని వెతికిపట్టమన్నాడు. అప్పట్లో ప్రతిమ మాత్రమే తెలిసిన మనిద్దరం అతడికి పిచ్చి పట్టినట్లు ఆనందరావు వంక చూసాం. అయితే, పిచ్చి జెస్సికాని వెతికిపట్టమన్న అతడికి కాదు.  ప్రతిమ పోలికల్తో ఉన్న జెస్సికాతో పైకి చెప్పుకోలేని ఏదో అవసరం ఉండబట్టే ఆనందరావు నిన్ను రహస్యంగా ఆశ్రయించాడు. జెస్సికాతో ఫణిభూషణరావుకి అంత రహస్యమైన అవసరమేముంటుందో... ఆలోచిస్తే చాలు!’’  అని ఓక్షణం ఆగి.... ‘‘ఓ ప్రాణం నిలబెట్టిన వాళ్లమవుతాం’’ అంటూ చీకట్లో ఓ బాణమేసాడు తేజ.

‘‘అంటే...’’

‘‘ఔను సిద్దార్థ. నాకెందుకో ఫణిభూషణరావు వల్ల జెస్సికాకు ప్రాణగండం ఉందనే అనుమానం కలుగుతోంది. కారణం... ఆమె ప్రతిమ పోలికల్తో ఉండడమే. అంతేకాదు ప్రతిమ చనిపోవడం కూడా కారణం కావచ్చు. ప్రతిమ లాంటి ఆమెని ప్రపంచంలో ఉండనీయకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే జెస్సికా ఉనికి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆ ఫణిభూషణరావు. నీకో సంగతి చెప్పనా ... నాకు తెలిసింది కారు నంబరొక్కటే కాదు. 

ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా..  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika