Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

27-11-2015 నుండి 03-12-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

..

మేష రాశి :  ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో ఊహించని మార్పులు ఏర్పడుతాయి. ప్రయాణాల మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది కావున వాటిని వాయిదా వేయుట ఉత్తమం. సంతానపరమైన విషయల్లో కొంత ఒత్తిడి పొందుతారు బాగా ఆలొచించి నిర్ణయం తీసుకోవడం సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న తడబాటులు ఉన్న సర్డుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపును పొందుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను మొదలు పెడతారు అందరిలో గుర్తింపు లభిస్తుంది. అమ్మతరుపు వారి నుండి చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచును సర్దుబాటు అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మార్పులు నిదానంగా కలుగుటకు అవకాశం ఉంది ఓపిక అవసరం.      

 

 

 

వృషభ రాశి  ఈవారం మొత్తంమీద పనిఒత్తిడి ఉంటుంది, తోటివారి నుండి సహకారం కోరుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నూతన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి, మీ ఆలోచనలను వారికి తెలియజేయుట మంచిపని. సమయాన్ని సాధ్యమైనంత వరకు వినియోగించుకోవడం అనేది సూచన. కుటుంబంలో సభ్యులమధ్య సాన్నిహిత్యం పెంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది వారి ఆలోచనలను పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. మిత్రులతో కలిసి దూరప్రదేశాలు ప్రయాణం చేయుటకు అవకాశం ఉంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం,విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. 

 

                  
మిథున రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆశించిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. నూతన పనులను చేపట్టు విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అనేది సూచన. నలుగురిలో కలిసి పనిచేసే సమయంలో అందరిని కలుపుకొని వెళ్ళు స్వబావం వలన మేలుజరుగుతుంది, ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన ఉద్యోగంలో బాగానే ఉంటుంది.  కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాస్త జీవితభాగస్వామి ఆలోచనలు వినడం మేలు. ఆర్థికపరమైన అంశాలలో ఫలితాలు అనుకూలంగానే వచ్చుటకు ఆస్కారం ఉంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన, సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు వస్తాయి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో సభ్యుల ద్వార నూతన ఆలోచనలు వింటారు, ఎఫ్వ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానేఉన్న దానికితగ్గట్టుగా ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మీయొక్క మాటతీరు మూలాన కొంతమంది భాధకు లోనయ్యే అవకాశం కలదు. సోదరసంభందమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.       

 

 

సింహ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది, నూతన  పరిచయాలు ఏర్పడే ఆస్కారం ఉంది.  మీయొక్క వ్యవహారశైలి మూలాన నూతన సమస్యలు పొందుతారు కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ధనమునకు సంభంధించిన విషయాల్లో నూతన ఆలోచనలు పక్కనపెట్టి అనుభవజ్ఞుల ఆలోచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారుల మూలాన పనిఒత్తిడి ఉన్నను ఆశించిన స్థాయిలో నలుగురి నుండి సహకారం లభిస్తుంది. ప్రమోషన్ అలాగే బదిలీలకు ఆస్కారం కలదు . విందులలో పాల్గొంటారు వాటి విషయంలో ప్రత్యేకమైన అభిరుచిని చూపిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల నుండి సలహాలను పొందుతారు వాటిని ఆచరించుట మంచిది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.  


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండుట సూచన. మిత్రులతో కలిసి చేయు ఆలోచనల విషయంలో స్పష్టమైన అవగాహన అవసరం. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానవిషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది, ఈవిషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు,  వాటికి సమయాన్ని ఇస్తారు చిన్న చిన్న జాగ్రత్తల తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన నూతన అవకాశాలు పొందుతారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారినుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కుటుంబంలో సర్దుబాటు మూలాన పనులు పూర్తిఅవుతాయి.      

 

  

తులా రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిలో గుర్తిపు పొందే ఆలోచనలు చేస్తారు అలాగే సామాజిక సేవకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతనగా పూర్తిచేసే అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది . స్వల్పఆరోగ్యసమస్యలు తప్పకపోవచ్చును సమయానికి భోజనం చేయుట మంచిది. శస్త్రచికిత్సల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు.  బంధువులతో కలిసి చేపట్టిన పనుల్లో అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. దిద్దుబాటు చర్యలు పెద్దల సూచనల మేర చేయుట వలన నష్టంకొంత తగ్గుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనేఅవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాలలో ఊహించని మార్పులు ఏర్పడుతాయి.     

 

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఒడంబడికలను చేసుకుంటారు. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి చాలాకాలంగా ఎదురుచూస్తున్న విషయంలో సంతృప్తినిచ్చే ఫలితాలు పొందుతారు. బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. మాటను పొదుపుగా  వాడుట వలన మేలుజరుగుతుంది. లేకపోతె వివాదాలకు కారణం మీరే అవుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారికి అనుగుణంగా ఆలోచనలు చేయుట మంచిది. దూరప్రదేశం నుండి ఒక సంతోషకరమైన వార్తను వింటారు. కొన్ని కొన్ని విషయాల్లో అనవసరంగా ఆందోళన చెందుటకు అవకాశం ఉంది, కావున ఈ విషయంలో మానసికంగా దృడంగా ఉండుట సూచన.   

 

ధనస్సు రాశి  :ఈవారం మొత్తంమీద బంధువులను కలిసే అవకాశం ఉంది, వారితో కలిసి చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. గతంలో పూర్తిచేసాము అనుకున్న పనులను తిరిగి చేపట్టవలసి వస్తుంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల వలన మాటపడవలసి రావోచ్చును కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో అనుభందాలకు ప్రాధాన్యం ఇవ్వండి, లేకపోతే మీ మధ్య దూరాలు పెరుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు కాకపొతే శ్రమ తప్పక పోవచును. మీయొక్క ఆలోచనలను తోటివారు వ్యతిరేకించే అవకాశం ఉంది ఈ విషయంలో సర్దుబాటు అవసరం లేకపోతే మానసికంగా ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు జాగ్రత్త.       

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద చేసే పనులలో ఒత్తిడి ఉంటుంది . ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో సరైన శ్రద్ధను కలిగి ఉండుట మంచిది.  ఆర్థికపరమైన విషయాల్లో తోడ్పాటు లభిస్తుంది,  కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. నూతన చర్చలకు అవకాశం ఇస్తారు. వ్యాపారపరమైన విషయలలో అనుభవజ్ఞుల సూచనల మేర నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట కాస్త ఊరటను కలిగించే విషయం. దూరప్రదేశం నుండి మీరు తెలుసుకొనే సమాచరం మీకు ఎంతో కొంత మేలుచేసేదిగా ఉంటుంది. శుభకార్యాక్రమాలలో పాల్గొంటారు వాటికి సమయాన్ని ఇస్తారు. మిత్రులతో కలిసి తీసుకొనే నిర్ణయాల్లో మాత్రం తొందరపాటు పనికిరాదు. వివాదాస్పదమైన విషయాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండుట సూచన. 

                  

 

      

కుంభ రాశి :ఈవారం మొత్తంమీద నలుగురిలో గుర్తిపు పొందే ఆలోచనలు చేస్తారు అలాగే సామాజిక సేవకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతనగా పూర్తిచేసే అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది . స్వల్పఆరోగ్యసమస్యలు తప్పకపోవచ్చును సమయానికి భోజనం చేయుట మంచిది. శస్త్రచికిత్సల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు.  బంధువులతో కలిసి చేపట్టిన పనుల్లో అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. దిద్దుబాటు చర్యలు పెద్దల సూచనల మేర చేయుట వలన నష్టంకొంత తగ్గుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనేఅవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాలలో ఊహించని మార్పులు ఏర్పడుతాయి.    

    

మీన రాశి :ఈవారం మొత్తంమీద పెద్దలనుండి  గుర్తింపును పొందుతారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది.  ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను తగ్గించుకోవడం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. సేవాసంభందమైన పనులను మొదలుపెడతారు నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి వివాదములకు దూరంగా ఉండుట సూచన.  మిత్రులతో కలిసి నూతన వ్యపారపరమైన విషయాలను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఈ విషయంలో సంత్రుప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. కుటుంబంలో శుభాకార్యక్రమాలు జరుగుటకు అవకాశం కలదు.
 

మరిన్ని శీర్షికలు
sahiteevanam