Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
charan never forget orange movie

ఈ సంచికలో >> సినిమా >>

డబుల్‌ హ్యాట్రిక్‌కి రాజ్‌తరుణ్‌ రెడీ

raj tarun ready for double hatric
అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి, సక్సెస్ల మీద సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. 'ఉయ్యాల జంపాల' నుంచి, 'కుమారి 21ఎఫ్‌' దాకా ఒకదాన్ని మించిన హిట్‌ ఇంకొకటి కొడుతూ సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసిన రాజ్‌తరుణ్‌ కోసం ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ఈ యంగ్‌ హీరో డబుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ అయిపోయాడు. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే సినిమా డబుల్‌ హ్యాట్రిక్‌కి ప్రారంభ చిత్రం అవుతుందట.

శ్రీ శైలేంధ్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకుడు. రాజ్‌తరుణ్‌ సరసన ఆర్తన అనే కొత్తమ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. తొలి రెండు చిత్రాలు యూత్‌ని, ఫ్యామిలీస్‌నీ ఎట్రాక్ట్‌ చేస్తే, మూడో చిత్రం కేవలం యూత్‌ కోసమే అన్నట్లు చేశాడు రాజ్‌తరుణ్‌. ఈసారి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసేలా రాజ్‌తరుణ్‌ తాజా చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' రూపొందిందట. క్లయిమాక్స్‌ సినిమాకే హైలైట్‌ కానుందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. రాజ్‌ తరుణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా తమ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' నిలుస్తుందని దర్శకుడు గవిరెడ్డి చెప్పారు. ఆల్‌ ది బెస్ట్‌ టు రాజ్‌ తరుణ్‌. 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam