Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ntr class touch

ఈ సంచికలో >> సినిమా >>

అక్కినేని సోగ్గాడి సందడే సందడి

hungama of soggadu

అక్కినేని నాగార్జున పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా. పల్లెటూరి యాసలో టాలీవుడ్‌ మన్మధుడు మాట్లాడేస్తోంటే, అతని ఫాన్స్‌, ముఖ్యంగా మహిళా ఆడియన్స్‌ మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది. అంతలా వారికి తెగ నచ్చేస్తాడీ అక్కినేని హీరో. నాగార్జున ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు నందమూరి ఫ్యామిలీ హీరోల సినిమాలతో అక్కినేని నాగార్జున తొలిసారిగా పోటీపడుతున్నాడు ఈ సంక్రాంతికి. సాంప్రదాయమైన పంచకట్టుతో అచ్చమైన గోదారి యాసతో ఆకట్టుకుంటున్నాడు నాగార్జున. ట్రైలర్స్‌కు భీభత్సమైన రెస్పాన్స్‌ అందుతోంది. ఫాంటసీ టైప్‌ మూవీగా అన్పిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ మూవీగా తెరకెక్కుతోంది

ఈ సినిమా. తెలివైన, గడుసైన తండ్రి పాత్రలోనూ, అమాయకపు కొడుకు పాత్రలోనూ నాగార్జున కనిపించబోతున్నాడు. 'మనం' వంటి ఫీల్‌ గుడ్‌ మూవీ విజయం తరువాత మళ్లీ అంతటి ఫీల్‌ ఉన్న సినిమా కాబోతుందిట. హంసానందిని, అనసూయ వంటి ముద్దుగుమ్మలు కూడా నాగ్‌తో రొమాన్స్‌ చేయనున్నారు. అంతేకాదు, 'డంగ..డంగ..పాటలో నాగ్‌ తన గొంతును కూడా విన్పించారు. నిజంగా పండగలా సాగిపోయే ఈ చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
raja  arriving like express