Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raja  arriving like express

ఈ సంచికలో >> సినిమా >>

నాని హీరోగా 'కృష్ణగాడి వీరప్రేమగాధ'

nani as hero krishnagadi veera premagaadha

యంగ్‌ హీరో నాని, 'జై బాలయ్య' అనే సినిమాలో నటిస్తున్నాడనే ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా టైటిల్‌ మారింది. ఫిక్స్‌ అయిన టైటిల్‌ 'కృష్ణగాడి వీరప్రేమగాధ'. పాత తెలుగు సినిమా టైటిల్‌ ఫార్మాట్‌లో దీన్ని డిజైన్‌ చేశారు. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ ఐడియా చాలా ఇన్నోవేటివ్‌గా ఉందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. 'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ 'కృష్ణగాడి వీరప్రేమగాధ' తెరకెక్కుతోంది. ఇటీవల నాని నటించగా వచ్చిన 'భలే భలే మగాడివోయ్‌' పెద్ద విజయం సాధించడంతో 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ట్రేడ్‌ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది.

ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెలలోనే 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఆడియో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ అనుకుంటోంది. 14 రీల్స్‌ బ్యానర్‌ అంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న టాప్‌ బ్యానర్స్‌లో ఒకటి. అలాంటి బ్యానర్‌లో నాని హీరోగా వస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లోనూ, ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. మంచి కాన్సెప్ట్‌తో కూడిన సినిమాల్ని ఎంచుకుని, నటుడిగా ప్రతి సినిమాతోనూ కొత్తదనం చూపిస్తున్న నానికి ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ అవుతుందేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam