తన సినిమాల్లో హీరో అంటే ఏదో ఒక స్పెషల్ మార్కు ఉండాలని కోరుకునే సుకుమార్ తాజాగా 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్‌ను క్లాస్ లుక్‌లో డిఫరెంట్‌గా చూపించి విజయం సాధించాడు. ఆ సినిమా టైంలోనే బన్నీతోనూ, రాంచరణ్‌తోనూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతున్నాయని చెప్పిన సుకుమార్ ఇప్పుడు రాంచరణ్ కోసం ఒక స్టోరీ రెఢీ చేసేశాడట. ఆ స్టోరీని చరణ్‌కు ఇటీవల వినిపించినట్లు, చరణ్ అందుకు ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రాంచరణ్‌ను, సుకుమార్ ఒక డిఫరెంట్ లుక్‌లో చూపించే ప్రయత్నంలో ఉన్నాడట. సుకుమార్ సినిమాల్లో ఓ మ్యాజిక్ వుంటుంది. ఇంటెల్లిజెంట్‌గా ఉంటాయి. క్లాస్ టచ్‌తో ఉండే సుకుమార్ సినిమాలకి ఓవర్‌సీస్‌లో మంచి మార్కెట్ ఉంటుంది. ఆ విషయం 'నాన్నకు ప్రేమతో' సినిమా ప్రూవ్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌పై ఎప్పటినుంచో కన్నేసినా, నిఖార్సయిన ఓవర్‌సీస్ విజయం రామ్‌చరణ్‌ని ఊరిస్తూనే ఉంది. ఆ లోటు సుకుమార్ సినిమాతో రామ్‌చరణ్ తీర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రాంచరణ్ చేస్తున్న 'తనీఒరువన్' రీమేక్ తర్వాత సుకుమార్ సినిమా పట్టాలెక్కనుంది.
|