Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

26-02-2015 నుండి 03-03-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది,వారితో సమయాన్ని గడుపుతారు. మీయొక్క ఆలోచనలు కొన్ని కొన్ని సార్లు మిమ్మల్నే ఆత్మరక్షణలో పడవేసే అవకాశం ఉంది జాగ్రత్త. నూతన నిర్ణయాల విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేరనడుచుకోండి. పనిలో ఒత్తిడి ఉంటుంది అందుకనే సమయపాలన పాటించుట. కుటుంభంలో పెద్దలతో చర్చలకు అవకాశం ఇవ్వకండి. అవతలివారి ఆలోచనలు తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకొనుట వలన కూడా మేలుజరుగుతుంది. స్త్రీ / పురుష సంబంధమైన విషయాలలో ఖర్చులను పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోని మార్పులకు అవకాశం ఉంది. 

 

   

వృషభ రాశి ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు ఇష్టపడుతారు అలాగే నచిన వారినుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు. దగ్గర ప్రదేశాలకు ప్రయాణం చేయుటకు అవకాశం ఉంది,సమయాన్ని వృధాకాకుండా చూసుకొనే ప్రయత్నం మంచిది. మీయొక్క మాటతీరు మూలాన ఆప్తులను కోల్పోయే అవకాశం కలదు. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు ఉంటుంది కావున అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. 

                       

మిథున రాశి : .ఈవారం మొత్తంమీద  సంతానం మూలాన అనుకోని ఖర్చులను పొందుతారు. వ్యాపారసంబంధమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవారికి ఊహించని మార్పులకు ఆస్కారం ఉంది. వాహనముల మూలాన లేక అగ్నిసంభందమైన విషయాల వలన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. గతంలో మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులతో గుర్తింపును పొందుతారు. మానసికంగా దృడంగా ఉండుట వలన విలువైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు.   

 

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద  ప్రతిపనిలో నిదానం అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నూతన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో పనిభారం పొందుతారు గృహంలో మార్పులకు అవకాశం ఉంది లేదా గృహమార్పు ఉంటుంది. అనారోగ్యసమస్యలు పొందుతారు కావున ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. వ్యాపారపరమైన విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అనుభవజ్ఞుల సూచనలు సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇవ్వకండి. మాటపట్టింపులకు పోవడం వలన ఇష్టమైన వారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త.     

            


సింహ రాశి : ఈవారం మొత్తంమీద బాగుంటుంది చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన మార్పులకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. శక్తికి మించిన పనులను చేపట్టుట వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో లబ్దిని పొందుతారు కాకపోతే అతిగా ఊహించుకోవడం చేయకండి. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు ఈ విషయంలో దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి ఓపికఅవసరం. 

 


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద చక్కటి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది కావున కాస్త శ్రద్ధను కలిగి ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన సత్ఫలితాలు పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కలదు. వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేయు ప్రయత్నాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాలలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం అన్నది సూచన. 
    

 

తులా రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో సమయాన్ని గడుపుతారు, వారిని అనుకరించే ప్రయత్నాలలో నూతన సమస్యలు ఏర్పడుతాయి చూసుకోండి. సంతానం మూలాన అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి. వ్యాపరంలో భాగస్వాములతో చర్చలు చేయకండి. సాధ్యమైనంత వరకు సర్దుబాటు విధానం లేదా వారి సూచనలను గౌరవించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దూరప్రదశ ప్రయాణాలు అనుకూలం. సోదరసంభందమైన విషయాల్లో సమయం గడుపుతారు. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి శ్రమించుట ద్వార నూతన అవకాశాలు లభిస్తాయి.  
 

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద సమయానికి భోజనం చేయుట,ఆరోగ్యం విషయంలో మంచి శ్రద్దతీసుకోవడం అవసరం. ఊహించని ఖర్చులను పొందుతారు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు ఉంటాయి. పనులలో పనిభారం ఉంటుంది నిదానంగా వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయుట మేలు. పెట్టుబడులు అలాగే వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం చేయండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వలన మాటపడవలసి వస్తుంది. కుటుంబసభ్యుల తీరు మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది.    

 

 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది నూతన ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది కాకపోతే ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రావడం అనేది ఊరట. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు స్వల్పదూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి చేసిన పనులు కార్యరూపం దాల్చుటకు అవకాశం కలదు.  వ్యతిరేకవర్గం విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. అనవసరమైన విషయాలకు ధనంను ఖర్చు పెడతారు కావున ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది.              

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో నలుగురిలో గుర్తింపు పొందు పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. సామాజికకార్యక్రమాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. అధికారులతో చక్కటి అనుభందాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది వారికి అనుగుణంగా నడుచుకుంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రతలు తీసుకోవడం మంచిది సూచన. చర్చాసంభందమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత మేలుజరుగుతుంది. దైవసంభందపనులకు సమయం ఇస్తారు తీర్థయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రుల నుండి నూతన విషయాలను సేకరించే అవకాశం ఉంది.    

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి లేదా మీయొక్క వ్యాపారభాగస్వామితో కలిసి నూతన ప్రణాళికలు సిద్దం చేసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో అనుకూలమైన సమయం కావున అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం మూలాన మరింత లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి మన్ననలు పొందుటకు అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు నలుగురికి ఉపయోగపడుతాయి. సామాజికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్పఅనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. 

 

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి ,అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట మేలు. కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది వారితో నూతన చర్చలు చేయుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మార్చుకోవడం మూలాన మరింత అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సోదరసంభందమైన విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.   

మరిన్ని శీర్షికలు
Carpel Tunnel Syndrome (Wrist and Hand Pain) and Ayurveda Treatment in Telugu by Dr. Murali manohar