పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్ధార్ గబ్బర్ సింగ్' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాబీ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు ముద్దుగుమ్మ కాజల్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. గతేడాది 'టెంపర్' సినిమాతో హిట్ కొట్టిన కాజల్ ఈ ఏడాది మహేష్, పవన్ వంటి ఇద్దరు పెద్ద హీరోలతో ఈ ఏడాది వెండితెరపై సందడి చేయనుంది. 'సర్దార్ గబ్బర్‌సింగ్' విషయానికి వస్తే, ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న ఈ సినిమాతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గబ్బర్ సింగ్' సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో అంతకు డబుల్, ట్రిపుల్ రేంజ్‌లో వినోదం పంచనున్నాడట పవన్. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం కూల్ సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా మెగా ఫ్యాన్స్‌కి మస్త్ మజా అందించడానికి ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల్లోనే విడుదల కానుంది. 'గబ్బర్‌సింగ్'కి డబుల్ త్రిబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఫిక్సయిపోవచ్చని జరుగుతున్న ప్రచారంతో 'సర్దార్ గబ్బర్‌సింగ్'పై అంచనాలు ఆకాశాన్నంటేశాయి.
|